పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

మహాపురుషుల జీవితములు


అనుభవైక వేద్యమై యనిర్వచనీయమై యలోక సామాన్యమై యనన్యదుర్లభమయి యమూల్యమైన యాబ్రహ్మానందమును దేవేంద్రనాథుడు రాత్రియంతయు ననుభవించి మరునాఁటినుండియు పిచ్చివాఁడపోలె నేదియో మఱచి చింతించువాఁడపోలె దేనినోపోఁగొట్టుకొని వెదకువాడుపోలె మందమతియై తీవ్రమైన చిత్తక్షోభ మనుభవింపసాగెను. నాటిరాత్రి యానందమును మరలఁ దెచ్చుకొనవలయునని యతఁడెంత ప్రయత్నించినను సాధ్యము కాదయ్యె. మనశ్శాంతి కొఱ కాయన యింగ్లీషు తత్వ శాస్త్రములఁ జదువుకొనియెఁ గాని తానుగోరిన శాంతిరాదయ్యె. భగవంతుని సాన్నిధ్యమును బడయవలయునని యతఁడు ప్రతిదినముఁ బలుసారులు ప్రార్థనఁ జేయుచు వచ్చెను. ఒకప్పుడుదయము మొదలు మధ్యాహ్నమువఱకు నెండలో నతఁ డీశ్వరధ్యానము సేయుచుఁ బారవశ్యము జెందియుండ సేవకులు సుకుమారమగు వానిమేనెండచే బడలకుండ గొడుగులు బట్టుచు వచ్చిరఁట. ఇట్లు మూడు సంవత్సరములు గతించెను.

ఆతఁడిరువదియొక్క సంవత్సరములప్రాయముగలవాఁడైనప్పు డొకనాఁడు తనగదిలోఁ గూర్చుండఁగ వ్రాతపుస్తకములోని పత్ర మొకటి చిరిగి గాలికిఁ గొట్టుకొనివచ్చి యతని ముందటం బడియె. అందొక సంస్కృతశ్లోక ముండుటచే దనపురోహితుని దానియర్థమడిగి వానివలనం దెలియఁజాలక బ్రహ్మసమాజ ప్రధానాచార్యుఁడగు నీ రామచంద్ర విద్యావాగీశునొద్దకుఁబోయి దానియర్థమడిగెను. ఆపండిత శిఖామణియది యీశోపనిషత్తులోని మొదటి శ్లోకమనియు భగవంతుఁడు జగత్తంతయు నిండియుండును గనుకసర్వమీశ్వరమయమే యని యెంచి మనుష్యుఁడు పరులధనమున కాశఁ జేయక తనకున్న దానితోఁ దనివి నొందవలయునని దాని తాత్పర్యమనియు జెప్పెను. అది విని దేవేంద్రనాథుఁ డక్కజపడి యుపనిషత్తులలో నెంతెంత