పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/367

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
308
మహాపురుషుల జీవితములునిశ్చయించుకొని నాగపట్టణమును మిషను స్కూలులోఁ జదువుకొనుట కిష్టపడుదువా యని ముత్తుస్వామి నడిగెను. అందుకు ముత్తుస్వామి సమ్మతించి నందున తహసిల్ దారు వానిని నాగపట్టణము పంపించి బడిలోఁబ్రవేశ పెట్టించి వానికిసంరక్షకుఁడుగ నాగపట్టణములో నున్న తన తమ్మునే నియమించెను. ముత్తుస్వామి నాగపట్టణములో బదునెనిమిది మాసములు చదివి యాకాలములలో దన్ను గురించి యందఱకు మంచియభిప్రాయము కలిగించెను. అందు చేత దయాళువగు తహసిల్ దారు ముత్తుస్వామిని విద్యాభ్యాసము నిమిత్తము చెన్నపట్టణము హైస్కూలున కంపెను. అప్పటికి రాజా మాధవరావుగారు విద్యాభ్యాసము ముగించి యా పాఠశాలలోనే యుపాధ్యాయుడుగనుండెను. వెనుక తంజావూరు కలెక్టరుగానుండిన మాంటుగొమని దొరగారు గూడ గొప్ప యుద్యోగముమీద జెన్నపట్టణములో నుండిరి. బట్లరు తహసిల్ దారు మాధవరావుగారి కిమ్మని యొక యుత్తరమిచ్చి ముత్తుస్వామిని జెన్నపట్టణ మంపినందున మాధవరావుగా రాయుత్తరము జూచుకొని బాలుడగు ముత్తుస్వామి యం దభిమానముగలిగి శ్రద్ధతో విద్యాభ్యాసము చేయింప దొడగెను. మాంటుగొమనీ దొరగారు తంజావూరు జిల్ల జనులమీద మహాభిమానము గలవా డగుటచే నాజిల్లానుండి వచ్చి చెన్నపట్టణమున జదువుకొనుబాలుర క్షేమము స్వయముగా గనుగొనుచు వచ్చెను. ముత్తుస్వామియు దంజావూరువాఁ డగుటచే దొరగారి యనుగ్రహమునకుఁ బాత్రు డయ్యెను. ఆ యిరువుర దక్షతలోనుండి ముత్తుస్వామి యద్భుతముగ విద్యాభ్యాసము చేసెను.

అప్పుడు చెన్నపట్ణము హైస్కూలునకు పవెలుగారు ప్రథమోపాధ్యాయులై యుండిరి. దక్షిణహిందూస్థానమునకు విద్యావిషయమున నితడు చాల యుపకారముచేసెను. ఆయన శిష్యుడైన ముత్తుస్వామి