పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/366

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
307
సర్. తిరువఱ్ఱూరు ముత్తుస్వామి అయ్యరుతహసిల్ దారు వెంటనే వానిప్రశ్న కుత్తరము చెప్పుటకు వీలులేక లెక్కలు చూడవలయునని చెప్పి దాపున నిలువబడియున్న ముత్తుస్వామిని జూచి యా విషయమున నీ వేమైన నెఱుఁగుదువా యని యడిగెను. ముత్తుస్వామి యే లెక్కలు చూడకయే మిరాశీదారు డీయవలసిన పన్ను మొత్తము చెప్పెను. తహసిల్ దారు డది సరియగునో కాదో ఋజువు చూపించి సరియేనని గ్రహించెను.

పై నుదహరింపబడిన రెండు సంగతులంబట్టి ముత్తుస్వామి యద్భుతమగు బుద్ధిసామర్థ్యము గలవాడని తహసిల్‌దారు కచ్చేరీలోను మేజువారుగా నుండెనని తోఁచుచున్నది. ముత్తుస్వామి తన తెలివికిఁ దగని యీ యుద్యోగముతోఁ దనివినొందక యాగ్రామమున చొక్కలింగ మను నతఁడు పెట్టినబడికి మధ్యాహ్నము పదునొకండు గంటలు మొదలు రెండుగంటల వఱకుఁ దనకు పనిలేదుగావున నా సమయమున నక్కడకుఁ బోవుచు పోయి యూరకొనక యింగ్లీషు చదువుకొనవలెనని కుతూహల ముండెఁగాని స్థితిగతులు బాగులేక పోవుటచే నట్లు చేయుటకు వీలు లేకపోయెను. తహసిల్ దారునకు మేనల్లు డొకడుండెను. అతని నెట్లయిన బాగుచేయవలెనని మేనమామ వానికి స్వయముగా జదువు చెప్ప నారంభించి ముత్తుస్వామిని గూడ వానితో జేర్చి యిరువురకు నింగ్లీషు మొదటి పాఠపుస్తకము చెప్పెను. పుస్తకము ముగిసిన పిదప తహసిల్ దారు వారి నిరువురఁ బరీక్షింపఁదలచి యొక వారము గడువిచ్చి గడువు లోపల పుస్తక మంతయు జదువుడని వాని కానతిచ్చెను. వారం గడచిన పిదప తహసిల్‌దారు పరీక్షించు నప్పటికి బ్రాహ్మణ బాలుడు గ్రంథము సమగ్రముగ నప్పగించెను. తహసిల్‌దారు మేనల్లుడు కొన్ని పుటలు మాత్రమే చదువ గలిగెను. బ్రాహ్మణ బాలుని బుద్ధికుశలత కచ్చెరువడి తహసిల్ దారు వానిని జదివించి వృద్ధికిఁ దేవలయునని