పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజా సర్ మాధవరావు

301

అనంతరము మాధవరావు రాజ్యవ్యాపారవిహీనుఁడై చులుక నగు హృదయముతో తనజీవిత శేషమును జెన్న పట్టణమునగడపెను. ఆయన కాంగ్లేయులలోను స్వదేశస్థులలోను మిత్రు లనేకులుండి నందున నిర్వ్యాపారజీవనము భారమనిపించ లేదు. అప్పటికి రాజకీయ వ్యవహారములలో వాని కభిరుచి విశేషముగ నుండెను. ఇంగ్లాండు పత్రికలు, స్వదేశపత్రికలు చాలదెప్పించి యితఁడు చదువుచుండును. ఆదినములలో నతనికి సంఘసంస్కరణమునం దభిమానము కలిగెను. అతి బాల్యవివాహమువలన కలుఁగు నష్టములఁ దొలఁగింపవలెనని యతని ముఖ్యసంకల్పము. తక్కిన సంస్కరణములలోఁ గూడ మనము శాస్త్రములనేబట్టి పోఁగూడదనియు శాస్త్రములే కొన్నిస్థలములలో మార్పు చేయఁబడదగి యున్నవనియు నతఁ డభిప్రాయపడెను. అట్లభిప్రాయపడియు మాధవరావు సంస్కరణము వేగిధ పడక జాగరూకతతో జేయవలె నను తలంపు గలవాఁడు. పూర్వాచారములు నాశనము చేయఁగూడదనియు వానిని చక్కఁగామార్చుకొని యవలంభింప వలయుననియు నతఁడు జెప్పుచువచ్చెను.

1885 వ సంవత్సరమందు చెన్న పట్టణపుగవర్నరగు గ్రాండు డఫ్ ప్రభువు కోరికమీఁద మాధవరావు మలబారు నేల పన్ను విషయమున నేర్పడిన సభ కగ్రపీఠస్థుఁడై దొరతనమువారికి సాయము జేసెను. 1887 వ సంవత్సరమున గవర్నరగు కానిమరాప్రభువు శాస్త్రబ్రహ్మచారులకు శాస్త్రపండితులకు హితోపదేశము చయుటకు మాధవరావును నియోగించెను. అప్పుడాయన యిచ్చిన యుపన్యాసము వలన దక్షిణహిందూస్థాన మంతను వెలిగించిన యాతని జ్ఞాన జ్యోతియొక్క తేజస్సు నెల్లవారు జూడగలిగిరి. 1887 వ సంవత్సరమున నేషనల్ కాంగ్రెస్సనబడు దేశీయ మహాసభ చెన్నపట్టణమునం గూడెను. మాధవరావు దాని సన్మాన సంఘమున కగ్రాస