పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/340

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
285
మహారాజా సర్ రామవర్మఅవి చక్కఁజేయుట చాల శ్రమకరమని వెనుకటి మహారాజులు దాని జోలికింబోరైరి. రామవర్మ తన యావచ్ఛక్తి వినియోగించి పంటనేలలన్నియు గొలిపించి వానికిం దగినట్లు పన్నులు గట్టించెను. అది యైన పిదప రామవర్మ చిరకాలమునుండి కొచ్చినుసంస్థానప్రభువులకుఁ దనకుఁగల సరిహద్దుల వివాదమును బరిష్కరించుకొనఁ దలఁచి మధ్యవర్తుల నేర్పఱచుకొని వారు చెప్పినట్లువినుట కొడంబడి యావివాదము నంతమొందించెను. మహారాజున కీ మార్పులు చేయుట యొకయెత్తు సంస్థాన మందలి యుద్యోగస్థుల నదుపులో నుంచుట యొకయెత్తుగ నుండెను. రామవర్మ గద్దెయెక్కినప్పుడు లంచగొండు లందఱు నడుగంటెదరని నాగరికులగు పౌరులేగాక కొండవాండ్రుసయితము సంతోషించిరి. వారి కోరికలు సఫలము లయ్యెను. సర్కారు జీతములుతినుచు దురాశాపాతకులై లంచములకై ప్రజలం బీడించు దుర్వినీతుల నతఁడు నిష్కరుణముగ దండించి రైతులబాధ తొలగించెను. దుర్జనుల దౌర్జన్యము నడచుటలో వాని కెంతజాగ్రతయుండెనో సన్మార్గుల యోగ్యతను మెచ్చి బహుమానము చేయుటలో నంత జాగ్రత్త వానికుండెను. రాచరికము చేయుచున్నాఁడని పేరెగాని రామవర్మ చేసినంత పని యా సంస్థానములోఁ నేయుద్యోగస్థుఁడు చేసి యెఱుఁగడు. దివాను పంపించెడి కట్టలకొలఁది కాగితముల నవలీలగజూచి విషయములు గ్రహించి వాని మీఁద వేయవలసిన యుత్తరువులువేసి రామవర్మ యించుకేని యాలస్యముచేయక మరలఁ బంపుచుండును. అన్ని కాగితములను జూచుకొనుటయేగాక ప్రపంచములోఁ ననేక దేశములందున్న తన మిత్రులకుఁ బ్రతిదినము పలుజాబులు వ్రాయుచుండును. వేయేల సామాన్యుఁ డగు గుమాస్తా యెట్లు పని చేసినో యతఁడు నట్లె పనిచేసెను. ఈ మహారాజు ప్రాతఃకాలమున సూర్యుని కంటె