పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/338

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
283
మహారాజా సర్ రామవర్మజాడ్యవిముక్తుడై బ్రదికెను. బలము చేరినది మొదలు రామవర్మ యెప్పటియట్టే చదువునందు వ్రాతయందు తన కాలము గడుపుచు వచ్చెను. మాధవరావు దివానుగానుండిన కాలమున తిరువాన్కూరులో నుపయుక్తములగు మళయాళగ్రంథములు వ్రాయించుటకు చిన్న సభ యేర్పరచెను. ఆ సభకు రామవర్మ మిక్కిలి తోడుపడి సత్య, విద్య, యారోగ్యము మొదలగు విషయములుగూర్చి తాను స్వయముగ చిన్నిగ్రంథములు వ్రాసి యాసభవారికిచ్చుచువచ్చెను. మహారాజు కుమారుఁడయినను పాటుపడవలసినదనియు బాటుపడినందువలన గౌరవ లోపము లేదనియుఁ దానప్పటికి యువ రాజయ్యు కాఫీతోట వేయించి స్వయముగ పనిచేయించెను. ఆతఁడు పండించిన కాఫీతక్కిన కాఫీలకంటె శ్రేష్టతమమయినది. చెన్నపురమందు జరిగిన వస్తుప్రదర్శన సభవారు వానికొక బంగారు పతకమును బహుమాన మిచ్చిరి. బుద్ధికుశలతగల వారితోడను విద్యావంతుల తోడను రామవర్మ తరచుగ సహవాసముచేయ నభిలాష గలవాడు. ఈయభిలాష బంధముచేతనే యతఁడు సర్వకళాశాలలోఁ జదువుకొనుచుండిన కుశాగ్రబుద్ధులకు విద్యార్థులం దనమందిరమునకు రావించి వారితో విద్యాగోష్ఠి జేయుచుండెను. ఇప్పుడా సంస్థానమున గొప్పయుద్యోగములో నున్న పురుషు లనేకులు మొదటరామవర్మ చేరదీసినవారే. మైసూరు సంస్థానమున మంత్రిపదవి నొందిన రంగాచార్యులవారు కూడ మొదట రామవర్మచేత బెంపఁబడినవారే.

1880 వ సంవత్సరమున సంస్థానమును బాలించు మహారాజు మృతినొంద రామవర్మ తిరువాన్కూరు మహారాజయ్యెను. అతని పట్టాభిషేకము 1880 వ సంవత్సరము జూను 17 వ తేదీని జరిగెను. ఈయనవలె సర్వజనులకు నిష్టముగ గద్దెక్కిన మహారాజు మఱియొకఁ డుండఁడు. సకల విశారదుఁ డయి సచ్చరిత్రుఁ డగు రామ