పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/328

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
275
సి. వి. రంగనాథశాస్త్రినతఁడే ప్రథముఁడు. మదరాసు యూనివరిసిటీలో సభ్యుడైన హిందువులలోఁ బ్రథముఁడు. స్మాలుకాజు కోర్టులలో జడ్జీలుగా గూర్చుండిన హిందువులలోఁ బ్రథముఁడు. అనేక భాషలు నేర్చిన స్వదేశపండితులలోఁ బ్రథముఁడు.

ఉదరపోషణము నిమిత్త మొక్కభాష కష్టముగా నేర్చుకొనుటయే చాల శ్లాఘనీయము. రెండుమూడునేర్చుకొనుటమిక్కిలి యుత్కృష్టము, అట్టియెడ పగలెల్ల కార్యభారముచేత దీరికయించుకయు లేనివాఁడు పదునెనిమిది భాషలలోఁ బ్రజ్ఞావంతుఁడగుట మహాశ్చర్యకరము కాదా ? ఉద్యోగమైన తరువాత మనలోవిద్యావ్యాసంగము చేయువారు లక్ష కొకరైన యుందురో సంశయింపవలసి యున్నది. రంగనాథశాస్త్రి హిందువుఁడయ్యుఁ దక్కిన హిందువులవలె కేవల ముదరపోషణార్థమే విద్యనేర్చుకొనక జ్ఞానాభివృద్ధి నిమిత్తమై బహుభాషాపరిశ్రమముచేసి దక్షిణహిందూస్థానమునకు వన్నె తెచ్చెను. ఈనాటి యుద్యోగస్థులు విద్యార్థులు రంగనాథశాస్త్రి జూపిన మార్గము నవలంభించి క్రొత్తభాషలు నేర్చుకొందురు గాక! నేర్చుకొని యాభాషల యందలి మంచిగ్రంథములను స్వభాషలోనికి భాషాంతరీకరించి లోకోపకార మొనర్తురుగాక ! రంగనాథుఁడువలెనే యీనాటి యుద్యోగస్థులు తమ యధికారులగు తెల్లవారి యెదుట స్వతంత్రభావమునుజూపి వర్తింతురు గాక ! నక్కవినయములుసేయకపోవుదురు గాక!


Mahaapurushhula-jiivitamulu.pdf