పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/327

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
274
మహాపురుషుల జీవితములుములు బైబిలు ఖురాను జక్కగ నేర్చినవాఁడై యాయామతస్థులతో వాదములు చేయుచు హిందూమతమే యుత్కృష్టమైనదని సిద్ధాంతము జేయుచు వచ్చెను. హిందూమతము మనవృత్తికినడ్డుగనుండఁ గూడదని దానిని బ్రస్తుత నాగరికతకు సరిపుచ్చవలయునని వాని యభిప్రాయము. అతనికి హిందూమతముమీద నత్యంతమైన యభిమానముగలదు. ఒకప్పుడు క్రైస్తవమతములో గలిసిన బ్రాహ్మణ బాలకు నతఁడు మరల హిందూమతములో గలిపించెను. వర్ణ భేదమందతనికి విశేషగౌరవము లేదు. ధర్మమార్గమున మనము నడచుకొంటిమా దేవుఁడే మనల రక్షించునని యతని మతము. సత్యమే వాని దేవత. అతఁడు జన్మమధ్యమం దెప్పుడు నొక యబద్ధమైన నాడి యెఱుంగఁడని వాని శత్రువులుసయితము చెప్పుదురు. ఆ సద్గుణ మాతనికిఁ జిన్ననాటనుండియు గలదు. ఆయన మితభాషి. అతనికి మిత్రులు కొందఱు మాత్రమే యుండిరి. పరిచితుల నందరను మిత్రులుగ భావించువాడు కాడు. వ్యర్ధప్రసంగములు డంబములు వానికిఁ గిట్టవు. మితభాషియగుటచే మొదట నతనిఁ జూచినవారు గర్వి యనుకొందురు. కాని పరిచయమైన వెనుక నట్లనుకొనరు. అతనికి మరియాదలలో మిక్కిలి పట్టుదల గలదు. అవమానమన్నమాట యతడు సహింపలేడు. అమర్యాద మనుష్యుల నతఁడు మిక్కిలి యేవగించును. అతఁడు తెల్లవారు నల్లవారు నను భేదములేక యెల్లర సమగౌరవముతోఁ జూచువాఁడె కాని వారి నొకరీతి వీరి నొకరీతి గౌరవించువాఁడు కాఁడు. అంత గొప్పవాడయ్యు నిగర్వచూడామణి. అతఁడు మిక్కిలి స్వతంత్రస్వభావము గలవాఁడె కాని చేతులు నలుపుకొనుచు నక్కవినయములను జూపి యుపకారములను యాచించు వాఁడు కాఁడు. తెల్లవారతనిని సమానుడుగ భావించిరి. చెన్నపట్టణపు హైస్కూలులోఁ జదివి పరీక్షలోఁ కృతార్థుడైన హిందువులలో