పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/317

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
264
మహాపురుషుల జీవితములుయభిమానము పుట్టెను. ఈ యభిమానము వాని జీవితకాలాంతము వఱుకు నుండెను. కాలక్రమమున రంగనాథుని జ్ఞానము మిక్కిలి యభివృద్ధి నొందెను. కాని మేలుకోరిన జడ్జిగారు గ్రోవుసుదొరవద్ద నతఁడు చదివిన చదువుతోఁ దనివి నొందక యింక నెక్కుడు విద్య నేర్పింపవలయునని వానిం జెన్న పట్టణమున కంపఁదలచెను. తల్లిదండ్రులు మొదట దానికిష్టపడరైరి. కాని జడ్జీగారి ప్రేరణవలన తుదకు వారొడంబడ జడ్జీ చెన్నపట్టణములో గ్రామస్కూలులో ముఖ్యోపాధ్యాయుఁడుగా నున్న కెర్ దొరగారివద్దకు రంగనాథశాస్త్రిని కొన్నియుత్తరములు వ్రాసి యిచ్చి పంపెను. కెర్ దొర బాలుని విద్యాసక్తిజూచి యాశ్చర్యపడెను. కెర్ దొర దొరగారు మొదట కొంతకాలము చెన్నపట్టణములోను పిదప కొంతకాలము కలకత్తా నగరములోను ఉపాధ్యాయుడై యుండి హిందువుల కనేకులు కుపకారములు చేసి స్వదేశమునకుఁబోయి యచ్చట హిందువుల గృహ్యా జీవితములపేర నొక గ్రంథమువ్రాసి ప్రచురించెను. ఆగ్రంథములలో సందర్భవశమున నతఁడు రంగనాథశాస్త్రినిఁగూర్చి యిటులవ్రాసెను. "రంగనాథుఁడు నేను కలుసుకొనుట మా పరస్పరాభివృద్ధికే యని చెప్పవచ్చును. పగలు నిర్వహింపవలసిన కార్యములు నిర్వహించి మే మిరువురము సాయంకాలము యేదో విషయంగూర్చి చర్చలో దిగుచుండువారము. తెలివిగల దొరబుద్ధికిని రంగనాథుని బుద్ధికిని నా కేమియు భేదము కనఁబడ లేదు. బుద్ధియటుండ వాని సౌజన్యము సత్యగౌరవము మిక్కిలి శ్లాఘనీయములు."

రంగనాథశాస్త్రి చెన్న పట్టణములోఁ జదువుచుండిన కాలమున జడ్జీగారు వానినిగూర్చి మునుపటికంటె నెక్కువశ్రద్ధ వహించిరి. ఆయన కెర్ దొర పేర వ్రాసిన యొక యుత్తరములోని యీక్రింది సంగతులు చూచిన వాని యభిమానము తెలియును. "నీదగ్గిర రంగ