పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
22
మహాపురుషుల జీవితములుష్కారమునకు భయపడక కష్టములను గణనసేయక తనకు ధర్మకార్యమని తోచిన దానినివిడువక కొనసాగించి "పరోపకారార్థ మిదం శరీర" మనుమాట సార్ధకముచేసిన మహాత్ము డీశ్వర చంద్రుడే. మెత్తని మనసుగలవాడయ్యు దృఢచిత్తుడు. పరమశాంతుఁడయ్యు దుష్టులకు భయంకరుఁడు; నమ్మిన ట్లాచరించుటయందును మనసులో నున్నమాట నిర్భయముగ, బలుకుటయందును పరులసౌఖ్యమునకై స్వసౌఖ్యమును మానుకొని కష్టపడుటయందును నతని కతండె సాటి యనవచ్చును. అతని యౌదార్యము నతని వినయము నతని సౌజన్యము నతని శాంతము వాని విద్యకు వన్నె వెట్టినవి. దేశమున కీతఁ డొనర్చిన మహోపకారమునకు దేశస్థులలో గొందఱు కృతజ్ఞులై వాని గుణగణంబులఁ గొనియాడుచు నెన్నియోపాటలు పద్యములు రచించిరి. అవి యిప్పటికిని బంగాళాదేశమున మారుమూలల సయితము పాడఁబడుచుండును.


మహర్షి దేవేంద్రనాథ టాగూరు


టాగూరనుమాట ఠాగూరను పదమునుండి వచ్చెను. ఈశబ్దమునకు జమీందారుఁడని యర్థము. కాఁబట్టి మహార్షి దేవేంద్రనాథ టాగూరు మిక్కిలి గౌరవముగల జమీందారుకుటుంబములోనివాఁడని మనము తెలిసికొనవచ్చును. ఈటాగూరుల సంస్థానము బంగాళాదేశములో జస్సూరుమండలమున నున్నది. దేవేంద్రనాథుని పూర్వులలో నొకఁడగు పంచాననటాగూరు స్వస్థలమును విడిచి కలకత్తానగరమునకుఁ గాపురము వచ్చెను. వానికొడుకు జయరామటాగూరు దొరతనమువారి యొద్ద గొప్పయుద్యోగముఁ జేసి సాధుర్యఘట్టమున నొక సౌధముఁగట్టి సుప్రసిద్ధుఁడయ్యెను. అతని మునిమనుమఁడగు ద్వారక