పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/303

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
252
మహాపురుషుల జీవితములులకు విశేషముగా బనులిచ్చుట లేదు. 6. న్యాయస్థానములగు కోర్టులలోఁ దరుచుగ నన్యాయమే జరుగుచున్నది. 7. ఇదిగాక యానాటివా రనుభవించెడు ననేకకష్టములను గూర్చియువ్రాయబడియున్నది. ఆ సభకు లక్ష్మీనర్సు శెట్టి యగ్రాసనాధిపతి యయ్యెను. సభ మొదటి నుండి చివరవఱకు నిశ్శబ్దముగ గ్రమముగ రాజభక్తికి లోపము లేనట్టుగా జరిగినను గొందఱు దొరలు సభలో నల్లరి జరిగెననియు నగ్రాసనాధిపతి రాజద్రోహగర్భితములకు మాటల నుపన్యసించె ననియు వానిమూలమున జనులు పితూరీ చేయుదురనియు జాట జొచ్చిరి. ఆసభలో "శెట్టి మనకష్టములను బై యధికారులకు వినయ పూర్వకముగా విన్నవించు కొందుమేని వారు మన యాపదలను నివారింపకపో"రని చెప్పెనేగాని చెప్పకూడదని నేమియు నుపన్యసింపలేదు. ఆ మహజరులో వ్రాలు చేయవలదని దొరతనమువారి పక్షమువారు కొందఱు జనులను భయపెట్టిరి. గాని యెందఱు బెదిరించినను దానిలో బండ్రెండువేలజనులు వ్రాళ్ళు చేసిరి. అతడా మహజరు గవర్నరుగారి ద్వారా సీమకు బంపెను. గవర్నరుగారా మహజరు తనవద్దకు వచ్చినప్పుడు దానిమీద "జనులు గవర్నమెంటు వారు చేయు కార్యములు నెఱుగక మిడిమిడిజ్ఞానముగలవారి ప్రేరణమున నిట్టి పనులు చేయుచున్నా"రని వ్రాసియింగ్లాండునకు బంపిరి. గవర్నరుగారు వ్రాసిన వ్రాతలనుబట్టి యా మహజరు సీమలో బుట్టదాఖలయ్యెను. జనులు మహజరు లంపుచున్నారని సందేహించి దొరతనమువారు పాఠశాలలో బైబిలు చదివించుట కొంతకాలము మాని 1853 వ సంవత్సరమున వెండియు దద్విషయమున బ్రయత్నించిరి. కాని నార్టనుదొరగారు లక్ష్మీనర్సు శెట్టిగారు కలసి పాటుపడి యాపని సాగనియ్యరైరి.

ఆకాలమందే యింగ్లాండు పార్లమెంటుమహాసభలో నొకసభికుడగు డాంబిసేమరు దొరగారు హిందూదేశమునుజూడవచ్చిరి. శెట్టిపం