పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/301

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
250
మహాపురుషుల జీవితములుగస్థులు వారి యాజ్ఞావర్తులగు జడ్జీలు క్రెసెంటు పత్రికలోని సూది పోటులవంటి మాటల కుడికి బహిరంగముగా దానినేమియు జేయఁజాలక లోలోపల మతబోధకులకు దొంటికంటె నెక్కుడు సహాయము బ్రోత్సాహము చేయసాగిరి. ఆకాలముననున్న యితరపత్రికలకు జూపిన యాదరమును దొరతనమువారు క్రెసెంటుపత్రికకు జూపరైరి. దీనికొక్క తార్కాణముగలదు. క్రెసెంటును పేరుతోనొక పత్రికాదిపతి గవర్నమెంటువారికి విజ్ఞాపనముచేయ దక్కిన పత్రిక లన్నిటికి అట్టి యాదరముచూపిన గవర్నమెంటువారు దీనిపేరు తమ గెజిటులో వేయుటకు వీలు లేదని తెలియజేసిరి.

ఈనడుమ దొరతనమువారు క్రైస్తవులలో గలసిన హిందువులకు కష్టములు లేకుండుటకు నొక చట్టము నిర్మింపదలంచిరి. ఆ చట్టమునుబట్టి క్రైస్తవమతములో గలసినహిందువులకు స్వమతములోనున్నప్పుడు వచ్చునట్లే పిత్రార్జితమగు నాస్తిలో దమవంతు భాగము నిరాటంకముగ వచ్చును. ఈచట్టము ధర్మవిరుద్ధమనియుఁ బ్రజలకుహానికరమనియుదలంచి లక్ష్మీనర్సు శెట్టి 1845 వ సంవత్సరము 9 వ యేప్రియల్ తారీఖునఁ జెన్నపురములో మహాజనుల నందఱిని బిలిచి సభచేసి సీమలోని యధికారులకు మహజరు బంపుట నందఱ నొప్పించెను. ఆసభకు సమస్తజనులు వచ్చి దొరతనమువారు చేయఁదలంచుకొన్న చట్టము హిందువుల యాచార వ్యవహారములకు విరుద్ధమనియు దానిని నిర్మింపనీయవద్దనియుఁ బ్రార్థించుచు గొప్ప మహజరువ్రాసి యింగ్లాండునకు బంపిరి. చెన్నపురి దొరతనమువారికి సీమలోని యధికారులకు గొంతకాల ముత్తర ప్రత్యుత్తరము జరిగిన పిదప నట్టిచట్టము నిర్మించుట లేదని యింగ్లాండులోని యధికారు లభయమిచ్చిరి. ఈకార్యమున విఫలప్రయత్నులై క్రైస్తవ మతబోధకులు తమ తమ వ్యాప్తికి మరియొక దారి వెదకికొనఁ