పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/300

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
[32]
249
గాజుల లక్ష్మీనర్సు శెట్టికులు నీతినియమములు లేక బాలురను గలుపుకొనుటయు వారికి రహస్యముగ దొరతనమువారు దోడ్పడుటయు నెఱిఁగి హిందువు లందఱు విశేషముగ మనస్తాపము నొందుటచేత లక్ష్మీనర్సు శెట్టి, స్వదేశస్థుల మతవిషయములలో నింగ్లీషువారు సంబంధము కలుగ జేసికొనమని మొదట ప్రతిజ్ఞ చేసి పిదప జేయరాని పనులు చేయుచుండినందున వాని నివారించుటకుఁ తనసర్వశక్తిని వినియోగించి పని చేయవలయునని కృతనిశ్చయుం డయ్యెను. ఆకాలమున జెన్నపురియందు నేటివు సర్క్యులేటరను నొక పత్రిక యింగ్లీషులో ప్రకటింపఁబడుచుండెను. వానికి నారాయణస్వామి నాయఁడను నతఁడు పత్రికాధిపతి. లక్ష్మీనర్సు వానియొద్ద నాపత్రికను ముద్రాయంత్రమును వెలకుఁ గొని "క్రెసెం"టను క్రొత్తపత్రికను ప్రచురింపఁదలచి దానికి హార్లేయను నొక దొరగారి నధిపతిగా నేర్పరచెను. క్రెసంటు శబ్దమునకుఁ జందమామయని యర్థము. హార్లేదొర యంతకుమున్ను సైన్యములో బనిచేసినవాఁడు గావున నతఁడు పత్రికను నడుపునప్పుడు సైతము వెనుకటి వీరరౌద్రరసములు చూపుచు నందరకు భయంకరుఁడై యుండెను. ఆపత్రికయొక్క మొదటిసంచిక 1844 వ సంవత్సరము 2 వ యక్టోబరు తారీఖున బయలు వెడలెను. అప్పటికి మన శెట్టికి ముప్పది యెనిమిదేండ్ల వయస్సు హిందూదేశస్థులను సమున్నతస్థితికిఁ దెచ్చుటయే యాపత్రికయొక్క ముఖ్యోద్దేశమని యందు వ్రాయబడెను. ఆదినములలో రికార్డు అనునొక పత్రికను బ్రకటింపుచు వచ్చిరి. క్రెసెంటు పత్రిక రికార్డు పత్రికలోని తప్పులను జూపుచు గ్రైస్తవమత బోధకుల దురాచారములను ఖండించుచు వారి యవకతవకలను వెలిపుచ్చుచువచ్చెను. మొట్టమొదట క్రెసెంటుపత్రికమీద ననేకులకుఁ గోపమువచ్చెనుగాని యెవరికి గోపమువచ్చిననను లెక్క సేయక యది తనపనిచేయుచు కాలూది నిలచెను. దొరతనమువారి గొప్పయుద్యో