పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/30

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
21
ఈశ్వరచంద్ర విద్యాసాగరులుయవసానకాల మచ్చట గడప నిశ్చయించుకొని యతఁ డచ్చటికి బోయియుండెను. 1890 వ సంవత్సరమున డిశంబరు నెలలో తన దేహస్థితిబొత్తిగ చెడిపోవుటచేఁ గొంతకాలము చంద్రనగరమునకున బోయియుండి యచ్చట స్వస్థతగానక చిట్టచివరకుఁ గలకత్తానగరము జేరి యంతకంతకు క్షీణించి 1891 వ సంవత్సరము జూలై 29 వ తారీఖున విద్యాసాగరుండు జీవయాత్ర ముగించి లోకాంతరగతుఁ డయ్యెను.

1877 వ సంవత్సరము జనవరి యొకటవ తారీఖున విక్టోరియా రాణి హిందూదేశ చక్రవర్తినీ మహాబిరుదము ధరించినప్పుడు కలకత్తాలో దొరతనమువారు విద్యాసాగరునకు నొక గౌరవ పత్రికను దయచేసిరి. 1890 వ సంవత్సరమున జనవరి నెలలో జరిగిన దర్బారులో దొరతనమువా రతనికి సి. ఐ. ఇ. బిరుదము నిచ్చిరి. ఈ మహాత్ముఁడు మహాధనవంతుఁడు, విద్యావంతుఁడు, కీర్తివంతుఁడునయ్యు వేష భాషలలో సామాన్యులవలెనుండి నిగర్వ చూడామణియై యుండెను. నిజమయిన దేశాభిమానమును బరోపకారబుద్ధిని ధర్మ కార్య శూరత్వమును వీనివద్దనుండియే నేర్చుకొనవలయును. విద్యాసాగరుఁడు కృపారసంపూర్ణుఁడై గుణరత్న నిలయుఁడై గాంభీర్యనిధియై సర్వ సంపన్నుఁడై భంగసంగతుఁడుగాక మరియాద నతిక్రమింపక సాగర శబ్దము తనయందు సార్థకమగునట్టు నడచిన లోకోత్తర చరిత్రుడు. క్రింది యుద్యోగస్థులు స్వగౌరవమును చంపుకొని తమ యధికారు లేకూఁతలు కూయుమన్న నవికూయుచు నేవ్రాతలు వ్రాయమన్న నవి వ్రాయుచు నేచేతలు చేయమన్న నవి చేయుచుఁ బ్రజలను వేధించు నీకాలములో నెల కైదువందల రూపాయలు జీతము గలిగి అధికారము గలిగి గౌరవమును దెచ్చు నుద్యోగమును దృణప్రాయముగ నెంచి వదలుకొన్న స్వతంత్రుఁ డీవిద్యాసాగరుఁడే. ప్రజల పొగడ్తలకు పొంగక దూషణలకు దుఃఖపడక బహి