పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

248

మహాపురుషుల జీవితములు

వులకుద్యోగములీయక క్రైస్తవ మతములో గలసినవారికే విశేషముగానుద్యోగములీయజొచ్చెను. చెంగల్పట్టు జిల్లాజడ్జీగా రొకనాడు వ్యాజ్యములో విచారణ చేయుటమాని తమ కచేరీ యొక మతబోధకుని యుపన్యాసము నిమిత్త మెరు విచ్చెను. క్రింది యధికారు లిట్లధర్మముగా ప్రవర్తించుచుండ దొరతనమువారేమైన వారి నదపులో నుంచిరో యన నదియులేదు. మీదుమిక్కిలి వారు మతబోధకులకు వ్యతిరేకముగా బనిచేసిన నెల్లవారి కపకారములు చేయసాగిరి. చెన్నపట్టణపు సాదరు కోర్టులో నొకజడ్జి దొరతనమువారు చెప్పినట్లు వినక న్యాయదృష్టి గలిగి మతబోధకులకు వ్యతిరేకముగా బనిచేసినందున వారు వాని యుద్యోగమును దీసి వేసిరి. ఆజడ్జీగారిని హిందువులు గౌరవించి వారికి దమకృతజ్ఞతను దెలిపినప్పు డాదొరగారీక్రిందివిధముగ దెలిపిరి.

"సాదరుకోర్టు జడ్జీల కిష్టములేని కార్యములు దొరతనమువారు చేయుమని వారినడిగినప్పుడు జడ్జీలు నోరు మూసుకొని యూరకొన్నపక్షమున దొరతనమువా రికముందు స్పష్టముగా హిందువులందరు గ్రైస్తవులలో గలియవలయునని యాజ్ఞాపింతురు. చెన్నపట్టణపు గవర్నరుగారు తమకట్టి యభిప్రాయము లేదని తెలిసినను గవర్నమెంటు సంబంధముగల కొందఱు పెద్దమనుష్యుల కిట్టిసంబంధములు గలవనియు వారు తలంచుకొన్నంతపని చేయగలరనియు ననుభవమువలన దెలియవచ్చుచున్నది. గవర్నమెంటువారి ప్రవర్తనంబట్టి సాదరుకోర్టు జడ్జీలు వారి యుత్తరువులం గొన్నింటిని మన్నించుటకు వీలు లేకపోయినది. అట్టి యుత్తరువులను న్యాయదృష్టిగల యే జడ్జీయు మన్నింపడు. న్యాయస్థానముయొక్క గౌరవము ను ధ ర్మ ము ను నిలువబెట్టుటకు గృ త ని శ్చ యుఁ డ నైనందునకే దొరతనమువారు నన్ను తీసివేసిరి. క్రైస్తవమతబోధ