పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/297

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
246
మహాపురుషుల జీవితములుపిదప 'సిద్ధుల శెట్టి కంపినీ' యను పేరు పెట్టి తండ్రియుఁ దానునుగలసి వాణిజ్య మారంభించిరి. ఆకంపెనీవారు నీలిమందు నమ్ముటయేగాక చెన్నపట్టణపు రుమాళ్లుగూడ నమ్మి చాలలాభము సంపాదించిరి.

అనంతరము కొంతకాలమునకు సిద్ధుల శెట్టి మృతినొంది లక్ష్మీనర్సు స్వతంత్రుఁడై విరివిగా వ్యాపారమును జేసెను. ఆకాలమున నమెరికా ఖండములోని దేశములుకొన్ని యంతఃకలహములు గలిగి యుండుటచే నచట ముఖ్యముగా పైరగుచుండిన దూదిపంట చెడిపోయెను. ఆకారణమున హిందూదేశమునందు నీజిప్టుదేశమునందు, ననేకులు దూది వర్తకము మీఁదబడిరి, లక్ష్మీనర్సు శెట్టియు దాని యద నెరిగి వివేషముగా దూదివర్తకము చేసెను. అతని యదృష్టము బాగుండుటచేఁ జేసిన బేరమెల్ల లాభకరమయ్యెను. అందుచేఎ నతఁడు స్వల్ప కాలములోనే లక్షలకొలఁది ధనము సంపాదించెను. కావలసినంత ధనమున్నది గదాయని సంతుష్టుడై యతఁడు మునుపటివలె వ్యాపారముమీఁద నంత శ్రద్ధ నిలుపక తనదేశస్థులకు రాజకీయ వ్యవహారములలో నెక్కుడు స్వాతంత్ర్యమునుగలుగ జేయవలెనని దృష్టియంతయు దానియందే నిలిపెను. ఆనాటిహిందువులు బొత్తుగా నింగ్లీషు తెలియనివా రగుట దను ప్రభుత్వ మెట్టిదియో బొత్తిగ నెఱుంగని మూఢులైయుండి చెన్నపట్టణములోనున్న యధికారులే సర్వస్వతంత్రాధికారులని భావించి సీమలో వారిపై యధికారులున్నారనియు వీరన్యాయములు చేసినప్పుడు వారికప్పీళ్ళు పంపుకొనవచ్చుననియు నెఱుంగక యిక్కడి యధికారులచేత ననేక బాధలు పడుచుండిరి. లక్ష్మీనర్సు శెట్టిమాత్రమే యాదొరల యన్యాయము లెఱిఁగిన వాడగుటచే "చెన్నపట్టణస్వ దేశసంఘ" మనుపేర నొక సంఘము స్థాపించెను. దాని ముఖ్యోద్దేశము జనులందఱికి నప్పటి దేశస్థితిగతులు తెలిపి ప్రజల కష్టసుఖములు దొరతనమువారికి వినయ