పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/294

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
243
సర్ సయ్యద్ మహమ్మదుఖానుజీలవంటి కాలేజీయొకటి స్థాపింప నుద్యుక్తుడై యుండెను. ఆకోరిక కొనసాగించుట కతఁడు ముందుగా నొక చిన్నసభ నేర్పరచి దాని ముఖ్యోద్దేశము తురకలకు విద్యావ్యాప్తి నెక్కువజేయుటగ నేర్పరచెను. 1872 వ సంవత్సరము 15 వ యేప్రియల్ తారీఖున నాసభకు మహమ్మడన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజి కమిటీయని పేరు పెట్టించెను. అది మొదలుకొని పనిచేసి 1875 వ సంవత్సరమున నా సభ వారు చిన్న పాఠశాలను స్థాపించిరి. ఆరంభము స్వల్పమైనను సయ్యదుమహమ్మదు గొప్ప యూహలు మనసులో పెట్టుకొని దానికి మూలధనము సంపాదింపఁదలఁచి గవర్నమెంటుక్రింద యుద్యోగము మానుకొన్నపక్షమున తనసంకల్పము సులభముగ నెరవేరునని 1876 వ సంవత్సరమున నుద్యోగము మాని పించను పుచ్చుకొనెను. అనంతరమతఁడు కొంతమూలధనము సంపాదించి కళాశాల ప్రారంభింప నప్పటి గవర్నరు జనరలుగారగు లిట్టనుప్రభువుగారు 1877 వ సంవత్సరం జనవరి 7 వ తారీఖున దాని స్థాపనోత్సవము జరిపిరి. 1878 వ సంవత్సరమున దొరతనమువా రతనిని గవర్నరుజనరలు గారి శాసననిర్మాణసభలో సభికుడుగ నేర్పరచిరి. అతఁడట్లు సభికుడుగ రెండుసారులు నియమింపఁబడెను. అతని జీవితవి శేషమంతయు నల్లీఖరుపట్టణమున మహమ్మదీయుల నిమిత్తము స్థాపింపబడిన యా కళాశాలకు మూలధనమునుబ్రోగుచేసి వృద్ధిచేయుట చేవిని యోగింపఁ బడెను. 1882 వ సంవత్సరమున హైదరాబాదు దివానగు సర్ సలారుజంగు కాలేజీని సందర్శించెను. అహమ్మదుఖాను వానికిమరల చూచుటకుబోయి వానివద్దనుండి కాలేజీకి కొంతధనము స్వీకరించెను. 1884 వ సంవత్సరమం దతఁడు మూలధనము సంపాదించుటకు పంజాబు దేశమందు సంచారము చేసెను. ఎక్కడకుఁ బోయినను మహమ్మదీయులు వానిని విశేషముగ గౌరవించుచు వచ్చిరి. అతఁ