పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/291

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
240
మహాపురుషుల జీవితములుయతని నిశ్చితాభిప్రాయము. హిందూ దేశములో సాంఘిక రాజకీయ విషయములలోఁ బ్రజలకుగల లోపముల కంతకు విద్యాహీనతయే మూలమని యతఁడు నమ్మెను. వేళ్ళు బాగుచేయుడు వృక్షము దానంత టదియే వృద్ధిపొందునని యతఁడు పలుమారు చెప్పుచువచ్చెను. అట్టి నమ్మకము నిశ్చయముగ నుండుటచేతనే యతఁడు 1858 వ సంవత్సరమున మహమ్మదీయులు దేశచరిత్రములను జదువుకొనుటకు మురాదాబాదులో నొకపాఠశాల పెట్టించెను. దేశచరిత్రా బోధకములగు గ్రంథములు హిందూస్థానీ భాషలో లేనందున నాగ్రంథ దారిద్ర్యమును నివారించుట కతడు భాషాంతరీకరణ సంఘము నొక దానిని నేర్పరచెను. ఇంగ్లీషులోని చరిత్రలను హిందూస్థానీలోనికి మార్చుటయే దాని ముఖ్యోద్దేశము. 1862 వ సంవత్సరమున నతఁడు షాజి పురమందు సబుజడ్జిగానుండి, యాకాలమందే క్రైస్తవ వేదమగు బైబిలునకు వ్యాఖ్యానము వ్రాసెను. అతని కింగ్లీషురాదు గావున బైబిలుమీఁదనున్న గ్రంథములన్నియు ముందు హిందూస్థానీలోనికి మార్పింపజేసి పిదప నీవ్యాఖ్యానమును ప్రారంభించెను. పైనచెప్పిన భాషాంతరీకరణ సంఘము నతఁడు షాజిపురమున నుండగానే 1864 వ సంవత్సరం జనవరి 9 వ తారీఖున స్థాపించెను. ఈ సంఘమే పిదప కొంతకాలమునటఁ బ్రకృతిశాస్త్ర సంఘమనుపేర నల్లి ఖరుపట్టణమున బయలుదేరెను. ఈ సంఘము మంచియుపకారము చేసెను. ఏలయన నింగ్లీషుభాషలోనున్న సద్గ్రంధము లెన్నో హిందూస్తానీ భాషలోనికి మార్చబడెను. ఆ సంవత్సరమే దొరతనమువా రహమ్మదుఖానును, ఆల్లీఖరుపట్టణమునకు సబుజడ్జీగా బదిలీ చేసిరి. ఈపట్టణము యతఁడు కావించిన సత్కార్య సంతతికి జన్మభూమి. ఈ పట్టణముపేరు తప్పక దలంపవలసి యుండును. 1866 వ సంవత్సరమందు గవర్నరు జనరలుగారగు లారెన్సు ప్రభువుగారు వాని చేసిన విద్యాభివృద్ధికి సంతసించి యొక బంగారు పతకమును మెకాలే కవిరచితమైన గ్రంథమును