పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
20
మహాపురుషుల జీవితములుపట్టణములో మన్నెపుజ్వరములు బయలుదేర జనులు తగిన వైద్య సహాయము లేక వందలకొలఁది మృతినొందిరి. అప్పు డీశ్వరచంద్రుఁడు కావలసిన మందులుకొని యక్కడకుం గొంపోయి యచ్చటి వారి కుచితముగఁ బంచిపెట్టి సాయము చేసెను.

విద్యాసాగరుఁడు పరుల ధనము చిల్ల పెంకువలె జూచునంతటి సత్శీలుఁడు. ఒకమారతఁడు తనధనమంతయు లెక్కజూచుకొనుచుండ లెక్కలంబట్టి తనయొద్ద నుండఁదగిన సొమ్ముకంటె నెక్కువ గానఁ బడియె. అదిచూచి యీశ్వరచంద్రుడు మున్నుతాను పాఠశాలా పరీక్షాధికారిగా నున్న పుడు దొరతనమువారిసొమ్ము కొంతపొరబాటున దనసొమ్ములోఁ బడియుండునని యనుమానించి 'ఎకౌంటెంటు జనరల్‌' గారికి వ్రాసి యాధనము గ్రహింపుమని ప్రార్థించెను. ఆయన యాసొమ్ము దొరతనమువారికి రావలసిన పని లేదని నొక్కి చెప్పినను వినక విద్యాసాగరుఁ డామిక్కిలిసొమ్ము దొరతనమువారి కిచ్చి తనయంతరాత్మను సందేహమునుండి విముక్తిఁజేసెను. ఆహాహా ఇట్టిపరిశుద్ధ చరిత్రమును ఋజుమార్గవర్తనమును గలవానిని వ్రేలు మడచి చూపుట యెంతకష్టమో మీరే యెఱుంగుదురు.

"మిస్ మేరీకార్పెంటరను" దొరసాని కలకత్తానగరమునకు వచ్చి దేశమునందలి బాలికాపాఠశాలలను గొన్నింటిని జూడవలయునని కోరి వానింజూపుటకు విద్యాసాగరునిం దనవెంటఁ బెట్టుకొని పోయెను. అతఁ డామె కాయాస్థానమునములం జూపి మరలివచ్చుచుండ మార్గమధ్యమున దైవవశమున బండి బోల్తపడ విద్యాసాగరుఁడు దెబ్బలచే స్మృతిదప్పి నేలంబడియె. తగుచికిత్సలు చేసిన పిదప కొంత కాలమునకతఁడు మరల బూటుకొనియెకాని తొల్లింటి యారోగ్యము దేహదార్ఢ్యము వెండియు రావయ్యె. ఇట్లు దుర్బల శరీరముతోడనే తరువాత నిరువదియైదు సంవత్సరములు గడపెను. సొంతాలు పరగణాలోనున్న కార్మతారుగ్రామమును దనకు నివాసస్థానముగఁ జేసికొని