పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/278

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
229
నవాబ్ సర్ సలార్ జంగుకొందురు. ఆ కాలమున నింగ్లీషువారికి సలారుజంగు చేసిన సహాయ మింతింతయన రానిది. ఉత్తర హిందూస్థానమంతయుఁ బెద్ద కాఱుచిచ్చువలె నుండెను. మధ్య హిందూదేశములోను దక్షిణహిందూదేశములోనున్న స్వదేశరాజులు హైదరాబాదువారు కొంచెముయూత యిచ్చిన యడల దొరతనమువారిమీద తిరుగబడుటకు సిద్ధముగ నుండిరి. హైదరాబాదు ప్రజల వీధులలో గుంపులుగూడి యింగ్లీషువారిమీద యుద్ధమునకు బోవుదు మని కేకలు వేయుచు వచ్చిరి. ఇంగ్లీషువారి ప్రభుత్వ మెంత యపాయస్థితిలో నుండెనో బొంబాయి గవర్నరుగారు హైదరాబాదు రెసిడెంటుగారి కిచ్చిన యీ క్రింది టెలిగ్రాపు వలనఁ దెలియవచ్చును. "నిజాము శత్రుపక్షమునఁ జేరెనా! హిందూదేశము మనకు పోయినదే గావున జాగ్రత్త పెట్టుము" ప్రజ లింగ్లీషువారిమీఁద నెంతద్వేషము చూపినను నిజాము మనస్సు మఱియొకలాగుండినను సలారుజంగుమాత్రము యెవరిమాటలు వినక నిశ్చలుఁడై యింగ్లీషువారి రాజ్యమును రక్షించెను. అప్పటి మంత్రి సలారుజంగు నింగ్లీషువారి కంతటి మేలు చేసెను. మఱియొకఁడైనచో నావిధముగాఁ జేయకపోవును. ఏది యెటులయినను సలారుజంగుమాత్ర మింగ్లిషువారిపక్ష ముండుటకే నిశ్చయించుకొనెను. ఆ పితూరి సమయమున సలారుజంగు చేసిన యుపకారమునకుఁ గృతజ్ఞులై గవర్నమెంటువారు వానికి ముప్పది వేలరూపాయలు వెలగల ఖిల్లతు నొక దానిని బహుమాన మిచ్చిరి. గవర్నరుజనరలు గారు వాని సహాయమునకుఁ సంతసించి యతఁడు హైదరాబాదు సంస్థానమును నిజామును నిష్కారణముగా నాశనముచేయక నిశ్చలబుద్ధి వహించినందుకు నింగ్లీషువారి పక్షమున నుండినందుకు ననేక వందనములఁజేసి గవర్నమెంటువారి కాప్తమిత్రుండుగ నెంచుకొనిరి.