పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/270

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
223
మహాదేవగోవింద రెనడీదంతయు జచ్చినదనియు దానితో మన కేసంబంధము లేదనియు ప్రస్తుతనాగరికతను భవిష్యత్కాలమందువచ్చు నాగరికతను సమగ్రముగ నవలంబించి బ్రతుకుటయే మనకు గార్యమనియు దలంచువారును మనలో ననేకులు గలరు. ఈయిరువురకు నడుమ మరియొక జిన్న తెగ కలదు. ప్రాచీన నాగరికతలో మంచినంతను మన మవలంభించుచు నీశ్వరేచ్ఛచేత మనదేశమున వ్యాపించుచున్న నవనాగరికతనుగూడ వదలక దానిలోనున్న మంచినిగూడ గ్రహించి యారెంటికి సమన్వయముచేసి మనము లాభము నొందవలయుననియు నీ తెగవారు దలంచుచున్నారు. ఇట్లు మే ముభయపక్షములు నవలంభించుటచే మా మిత్రులు శత్రువులుగూడ మా యభిప్రాయము నర్థముచేసికొనలేక యున్నారు. గతించిన మన మిత్రుడు వేదాంతమార్గప్రదర్శకుఁడు ధీరుఁడు నగు తిలాంగు నిశ్చయముగ నీ తెగలో జేరినవాఁడే. ఆసచ్చరిత్రుఁడు క్రొత్తనాగరికతను వదలి పూర్వాచార పరాయణుఁడై యుండినను లేక పూర్వాచారములను వదలి నవనాగరికుఁడై ప్రాచీనమంతయు వదలుకొనియుండినను పాపమింత స్వల్ప కాలములో మృతినొందక దీర్ఘ కాలము జీవించియుండునని నేను తలంచుచున్నాను. అట్లయినచో నతనికి విచారము లుండకపోవును. దేహస్థితిత్వరగా చెడకయుండును. తిలాంగు వానిమిత్రులు పడియెడు మనఃపరితాపమును మన యింగ్లీషుమిత్రు లెఱుగక ద్విభావము గల వారిని వారి నధిక్షేపించుచుందురు.

రాజకీయ వ్యవహారములయందును వానికి మిక్కిలి ప్రవేశము గలదు. అతఁడు గవర్నమెంటువారి యుద్యోగస్థుఁడైనను దేశీయ మహాసభను స్థాపించిన వార నేకాంశములలో నితని యాలోచనమును గ్రహించుచువచ్చిరి. బొంబాయిరాజధానిలో నతనిచేతసవరింపఁబడని గొప్పమహజరులు వానియాలోచనముపుచ్చు కొనిన ఘనకార్యములు