పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/269

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
222
మహాపురుషుల జీవితములుయొకరిచే జదువ బంపెను. ఆరోగ్యము మరల తిరుగనేలేదు. ఇతఁడు సంఘసంస్కారపక్షమువాఁ డగుటచే వానియభిప్రాయములు మతాంతరులగు తెల్లవారి యభిప్రాయము లేయని భావించి దేశస్థులలో గొందఱు తమకతఁడుచేయు నుపకార మెఱుంగక వానిని నవనాగరికుఁడని పూర్వాచార ద్వేషియని దేశమునకు శత్రువని యీప్రాంతముల సంస్కర్తల నిచ్చటివారు నిందించినట్లే నిందింపఁజొచ్చిరి.

సంఘసంస్కారము యుక్తమైనదని దగిన హేతువులు చెప్పి మన స్వదేశస్థులను మెప్పించుటకే యతఁ డెంతో కష్టపడుచుండ కొందఱాంగ్లేయులు గూడ నవనాగరికుల నధిక్షేపించుచు వచ్చిరి. రెనడీవారికిఁ గూడ దగిన యుత్తరములు చెప్పవలసి వచ్చెను. కాశీనాథ త్రియంబకతిలాంగుగారు కొన్ని యెడల పూర్వాచార పరాయణుఁడై కొన్ని విషయముల నవనాగరికుఁడై రెనడీవలెనేయుండి సంఘసంస్కారమునకై పాటుపడెను. అతనిని బూర్వాచార పరాయణులుఁ గొందఱు తెల్లవారు గూడ విరుద్ధ వర్తనుఁడని యధిక్షేపించిరి. ఆయధిక్షేపణలకు రెనడీ ప్రత్యుత్తరముల జెప్పుచుతిలాంగుగారి ప్రవర్తనమందు విరుద్ధమేమియు లేదని యీక్రిందివిధమున మాటలాడెను. ఈ సంగతులతఁడు ముఖ్యముగఁ తెల్లవారి నుద్దేశించియే పలికెను. "పరిపూర్ణమైన నాగరికతగలిగిన మీరు ప్రస్తుత ప్రాచీన నాగరికతల మధ్యమునబడి పరస్పరవిరుద్ధములగు రెండుమతముల సందున నిరికి యగచాట్లుపడుచున్న మమ్ముంజూచి మావర్తనము నర్థముచేసికొనలేకయున్నారు. అట్టిద్విభావ మక్కర లేదని తలంచు వారు మాలోకొందఱున్నారు. వారి యభిప్రాయమే మన దేశకాల పాత్రములబట్టి మనకేమార్పులు రాలేదనియు మనపూర్వులున్నట్లె యితరప్రపంచ సంబంధములేక మనముగూడ నుండవచ్చుననియు వారిమాట యటుండనిచ్చి రెండవపక్షము జూతము. ప్రాచీనమైన