పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/268

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
221
మహాదేవగోవింద రెనడీమని తలఁచి యతని మొగముమీఁదనే యామాట లనుచు వచ్చిరి. కాని దానియర్థము వారు గ్రహింపఁ లేదు. అతని చరిత్రము విరుద్ధము గాదు. మంచిమతములన్నిఁటియందు నతనికి సమానాదర ముండుటచే నతఁ డేమతములోను జేరినవాఁడు కాదనుకొనుటకంటె యతనిది విశాలహృదయమనియు నతఁడు సర్వసమానుఁడనియు మనము భావింపవలసియున్నది. అతని యభిప్రాయ మేమనగా ప్రపంచ ముత్తరోత్తర వృద్ధిగలదగుటచే క్రొత్తమతము లనేకములు పొడమినప్పుడు వైరుద్ధములు లేక సామ్యముగల విషయములలో నన్ని మతములవారుఁ గూడి పనిచేసి దేశము నుద్ధరింపవలయునని."

అతఁను తక్కిన రాజకీయాది విషయములలో జేసినపని యటుండ నిండు. ఆయన సంఘసంస్కార విషయమున జేసినపనికే దేశస్థు లందఱు మిగుల కృతజ్ఞులై యుండవలయును. అన్ని సంస్కారములకంటె సంఘసంస్కారమందే యతఁడత్యాదరము గలిగియుండువాఁడు. ఈ విషయమున నతఁడు తన యావచ్ఛక్తిని ధారవోసెను. ప్రతిసంవత్సరము దేశీయమహాసభ జరిగిన పట్టణములోనే సంఘ సంస్కరణసభగూడ గావించుచు నచ్చటికి విధిగా దానుబోవుచు నచ్చటసాంఘిక విషయమైన యుపన్యాసము మొకటి తానుచేయుచు నాసభలోజరిగిన చర్చలను స్వధనము వెచ్చపెట్టి ముద్రింపించుచు మరణకాలమువఱకు (ననగా బదునైదు సంవత్సరములు) ఆ మహాత్ముడు పాటుపడెను. ఆయననిజముగా మూఢాచారపరాయణులతో యుద్ధముచేయుచునే ప్రాణములు విడచెనని చెప్పవచ్చును. ఏలయన నతనిమరణమునకు నిరువదిదినముల క్రిందట దేశీయసభతో పాటు లాహోరునగరములో సంఘసంస్కరణ సభజరిగెను. రెనడీరోగపీడితుఁడై కదలలేక మంచమెక్కి యుండుటచే నక్కడ కెప్పటియట్ల పోలేక వాగ్జాలముగ దానియ్యవలసిన యుపన్యాసమును వ్రాసి