పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/266

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
219
మహాదేవగోవింద రెనడీబడి యప్పుడు గావించిన యుత్కృష్ట సహాయమునకు దొరతనము వారిచేత సి. ఐ. ఇ. అను బిరుదము నందెను. అదియునుగాక దొరతనమువారు వానినెన్నియో పర్యాయములు బొంబాయి గవర్నరుగారి శాసన నిర్మాణసభలో సభికుఁడుగ నేర్పరచిరి. 1893 వ సంవత్సరము నవంబరునెలలో కాశీనాథ త్రియంబక తిలాంగుగారు లోకాంతరగతుఁడగుటచే దొరతనమువారా నెల 23 వ తేదీని రెనడీగారిని హైకోర్టు జడ్జీగా నియమించిరి. నాడు మొదలుకొని రెనడీ తన మరణపర్యంతము నాయుద్యోగము మిక్కిలి సామత్యముతో నిర్వహించెను.

ఆయన 1901 వ సంవత్సరము జనవరి 17 వ తారీఖున మృతినొందెను. ఆతని మరణమునుగూర్చి హిందూదేశస్థులు తెల్లవారు సమానముగ శోకించిరి. దానిం బట్టియే జనులకతనియం దెంత యనురాగము గలదో తెలియగలదు. ఇటీవల వారిలో నెవరి మరణము జనులకు రెనడీ మరణమంత విషాదమును గలిగింపలేదు. ఏలయన రెనడి తన దేశస్థులయొక్క హృదయానురాగమునే సంపాదించుకొనెను. హిందూదేశముననున్న ప్రతిపట్టణమందు వానిమరణమును గూర్చి శోకించుటకును వాని కుటుంబమును పరామర్శ చేయుటకును సభలు జరుపఁబడెను. ఈసభలో హిందువు లొక్క రేగాక సర్వమతములవారు సర్వాభిప్రాయములవారును వాని యున్నత గుణములను మెచ్చి తమవిషాదముం దెలిపిరి. బొంబాయి హైకోర్టు జడ్జీలు వాని మరణము తమ హైకోర్టునకేగాక యావద్దేశమును నష్టకరమని వక్కాణించిరి. ఇండియాగవర్నమెంటువారు సయితము వాని మరణమునకు వగచుచు వాని సామర్థ్యాదులంగూర్చి యీ క్రిందివిధముగ వ్రాసిరి. అత్యధిక సామర్థ్యము పాండిత్యము స్వతంత్రస్వభావము గలిగిన రెనడీగారి మరణముచేత దేశమంతయు గొప్పనష్టముపాలై