పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/265

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
218
మహాపురుషుల జీవితములునాధము మొదలియారుగారికి నిట్టి గౌరవమే జరిగెను. ఆయనను గణితశాస్త్రములో బరీక్షించి డైరెక్టరుగారు ఉత్తరపుకాగితములను సీమకంపిరఁట. రెనడీగారి కద్భుతమైన జ్ఞాపకశక్తిగలదు. ఏ పుస్తకమయిన నొకసారి జదివి యందలి ముఖ్యసారాంశమును మరల వ్రాయగలిగినవాడఁట. కళాశాలలో నతఁ డుపాధ్యాయుఁడుగనుండి బాలురకిచ్చు నుపన్యాసములు మిగుల మనోహరములుగను బహు శాస్త్రార్థ సమేతములుగనుండుటచే తోడియుపాధ్యాయులు డైరెక్టరు దొరగారుఁగూడ వానికడకుబోయి విద్యార్థులతోపాటు గూర్చుండి యాయుపన్యాసములను వినుచుండెడివారఁట. ఏశాస్త్రమునుగూర్చి యైన స్వయముగా నాలోచించఁగలిగినశక్తిగలవాఁడు. హిందూదేశములో రెనడీ యొక్కఁడే యని మఱియొక దొరగారు పలికిరఁట. 1871 వ సంవత్సరమున రెనడీగా రుపాధ్యాయ పదవి మాని పునహా నగరములో సబుజడ్జీగా నియమింపఁబడెను.

ఆసంవత్సరమందే రెనడీ యడ్వొకేటు పరీక్షయందు గృతార్ధుడయ్యెను. దీనిచేత నతనికి ఇంగ్లీషు బారిష్టరుతో సమానమైన గౌరవముగలిగెను. అది మొదలుకొని యతఁడు మృతినొందువఱకు న్యాయాధిపతి పదవియందే యుండెను. 1871 వ సంవత్సరము మొదలుకొని పదిసంవత్సరములవఱకు నక్కడక్కడ సబిజడ్జీగానుండి 1881 వ సంవత్సరమందు పునహాసతారా చిన్నచిన్న కోర్టులను బరీక్ష చేయుటకు జడ్జీగా నేర్పరుపబడెను. 1884 వ సంవత్సరమున నతఁడు స్మాలుకాజుకోర్టు జడ్జిగా నియమింపఁబడెను. అక్కడ నున్నప్పుడె డక్కను కాలేజీలో రెనడీ ధర్మశాస్త్రవిషయమై కొన్ని యుపన్యాసముల నిచ్చెను. 1886 వ సంవత్సరమం దతఁడు గవర్నమెంటు వారిచేత హిందూదేశముయొక్క యాదాయ వ్యయములను గూర్చి యేర్పరుపఁబడిన సంఘములో సభికుఁడుగా నియమింపఁ