పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/25

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
16
మహాపురుషుల జీవితములుప్రతిపల్లెయందు ప్రతిపాఠశాలయందు ప్రతిబాలకుఁడు వానిగ్రంథములనే జదువుటచే నాతనికి రమారమి నెల కైదువేల రూపాయలాదాయము కొంతకాలమును మూడువేల రూపాయలు రాబడి కొంత కాలమును వచ్చెను. బంగాళాదేశపు పాఠశాలలో నిప్పటికిని వానిచేత రచియింపఁబడిన సంస్కృత గ్రంథములు బంగాళీగ్రంథములు చదువఁబడుచున్నవి. ఆభాషలో రచనా చమత్కృతిగల పండితు లిటీవల బహుగ్రంథములు రచించిరిగాని యవివిద్యాసాగరుని గ్రంథములకు సరిపోలవయ్యె. అందుచేత బంగాళీభాష కతఁడు గ్రంథ రూపమునఁ జేసిన మహోపకారమునకు వానియెడ దేశస్థులుకృతజ్ఞులై యున్న వారు.

సంఘసంస్కార విషయమున విద్యాసాగరుఁడు చేసినపని యసమానము. ఇతఁడే హిందూ దేశమున స్త్రీపునర్వివాహముల నుద్ధరించిన ప్రధమాచార్యుఁడు. ఇతఁడీపనికిఁ బూనుటను గూర్చి యొక చిన్న కథ గలదు. వాని దగ్గర చుట్టములలో నొకని కూఁతు రతి బాల్యమున వితంతువయ్యెను. తలిదండ్రులామెం దోడ్కొని మార్గవశమున నీపండితుని యింటికిరాఁగా విద్యాసాగరుని తల్లియా బాలిక చక్కఁదనమును లేఁబ్రాయమును జూచి దుఃఖపడి కొడుకు వద్దకుఁ బోయి నాయనా ! నీవింత పండితుఁడవు యీ బాలికను దుర్గతినుండి తొలగించి వివాహము చేయుటకు శాస్త్రములయం దెచ్చట నాధారము లేదా ? యని యడిగెనఁట. తల్లిమాటల నాదరముతో విని బాలికయవస్థకుఁ దానును మనసు కరుగవగచి యా నాఁడు మొదలతఁడు స్త్రీపునర్వివాహ విషయమున నాధారము లున్నవో లేవో కనుఁగొనుటకై శాస్త్రములు శోధించెను. 1854 వ సంవత్సరమున నతఁడు స్త్రీపునర్వివాహము శాస్త్రీయమని సిద్ధాంతీకరించి విధవా వివేకమనుపేర నొక చిన్నగ్రంథము వ్రాసెను. ఆపుస్తకము బయలువెడలిన తోడనే బంగాళా దేశమంతయు సంక్షోభను జెం