పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాశీనాథ త్రియంబక తిలాంగు

ఈతఁడు గౌడ సారస్వత బ్రాహ్మణుఁడు. ఈతని పూర్వులు రమారమి నూరు సంవత్సరములక్రిందట గోవానగరమునుండి వచ్చి బొంబాయిలో కాపురముండిరి. ఈయన 1850 వ సంవత్సరం ముప్పది యవ యాగష్టున జన్మించెను. ఇతఁడు బాబురామచంద్రతిలాంగుగారి రెండవ కుమారుఁడు. ఆయన పెదతండ్రి త్రియంబక రామచంద్ర తిలాంగుగారు సంతానహీనుఁ డగుటచే నీపిల్లవానిని బెంచుకొనెను. తండ్రియు పెదతండ్రియు నవిభక్తులై కలిసి యుండినందున జ్యేష్ఠుఁడే యింటిపెత్తనము చేయుచుండెను. పెంచుకొన్న పెదతండ్రి పూర్వాచారపరాయణుఁడై మిక్కిలి నీతిమంతుఁడైనందున కాశీనాథత్రియంబకతిలాంగువద్ద నుండిన సకలసద్గుణములు వానివద్దనుంచి నేర్చుగొనిన వేయని చెప్పవచ్చును. కొంతకాల మతఁడుస్వభాష చిన్న బడులలో నేర్చుకొని యింగ్లీషు జదువుటకు 1859 వ సంవత్సరమున నెల్ఫినిష్టన్ పాఠశాలకుఁ బోయెను. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు కేవలము జీతములకొఱకేగాక బాలుర విద్యాభివృద్ధికై పాటుపడుచు వచ్చిరి. అప్పుడు విద్యనేర్పినగురువులలో నారాయణమహాదేవ కరమానందుఁ డొకఁడు. కాశీనాథుఁడు పాఠశాలవిడిచినతరువాత సయితము కార్యాలోచన మేదియైనఁ జేయవలసి వచ్చినప్పుడు తన గురువగు పరమానందుని సహాయముగోరుచు వచ్చెను.

1864 వ సంవత్సరమునఁ గాశీనాథుఁడు ప్రవేశపరీక్షయందు, గృతార్థుడై కళాశాలలోఁ బ్రవేశించెను. ఆ కళాశాలాధ్యక్షుఁడును నందలి యుపాధ్యాయులును బాలురప్పగింప వలసినపాఠములు చదివించుటయేగాక బుద్ధిసూక్ష్మత హెచ్చుటకై యితర గ్రంథములుగూడ