పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/237

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
196
మహాపురుషుల జీవితములుపాటుపడి యామంత్రి సంస్థానపుఋణమంతయు దీర్చి వేయుటయేగాక ధనకోశములో గొంతసొమ్మునిలువగూడఁ జేసెను. సంస్థానమునందలి యుద్యోగస్థు లందఱు నడచుకొనవలసిన వ్యవహార ధర్మములను గొన్నింటినివ్రాసి యొకపుస్తకముగాఁ జేసి యానిబంధనలనుబట్టివారందఱు నడచుకొనున ట్లాజ్ఞాపించెను. ఈ పుస్తకమెంత యుపయోగకరముగా నుండెనో యీక్రింది సంగతినిబట్టి మీరేగ్రహింపవచ్చును. ఆకాలమున హైదరాబాదు సంస్థానములో రెసిడెంటుగా నుండిన బుష్టీ దొరగారు గ్వాలియరుసంస్థానములో రెసిడెంటుగా నుండిన మాక్పెరసను దొరగారికి జాబు వ్రాయుచు దినకరరావుగారు వ్రాసిన పుస్తకము మిక్కిలి యుపయోగకరముగా నుండుటచే నైజాం సంస్థానము నందుఁగూడ దాని నుపయోగింపవలెనని దన కభిప్రాయ మున్నట్లు వ్రాసెను. ఈ పనులకుఁ దోడు దినకరరావు 65 పాఠశాలలు సంస్థానములో స్థాపించి యొక చిన్న చదువుల డిపార్టుమెంటు కల్పించెను. పోలీసును న్యాయస్థానములును (కోర్టులు) చక్కపరచెను. కాలువలు త్రవ్వించి చక్కనిబాటలు వేయించి జనులకు ప్రయాణసౌఖ్యమును గలిగించెను; వాణిజ్యమునకు భంగకరములయిన సుంకములను గొట్టివేసి ప్రజలయొక్క స్థితిని బాగుచేయుట కెన్నివిధముల పాటు పడవలయునో యన్ని విధముల పాటుపడెను.

1857 వ సంవత్సరమునం దుత్తరహిందూస్థానమున గొప్ప సిపాయి పితూరి జరిగెను. ఆ కాలమున నింగ్లీషు దొరతనమువారికి దినకరరావు చేసిన యుపకార మింతింత యని జెప్పరాదు. హిందూదేశమందున్న స్థానాధిపతులందఱిలో సింథ్యావిషయముననే గవర్నమెంటు వారి కాదినములలో నెక్కువ యలజడి కలిగెను. సింథ్యా మహారాజుయొక్క సైనికులుగూడ పితూరీదార్లతోఁగలిసి సర్కారు వారితోఁ బోరాడ నభిలషించుచుండిరి. సింథ్యాగూడ నొకచేయి