పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/220

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
183
గోకులదాసు తేజ్‌పాలుగోకులదాసు చేసినట్లెవరును జేయలేదు. ఈ గోకులదాసు తేజపాలు యొక్క పేరు గుజరాతీదేశమున నెఱుగనివారు లేరు. అతని పేరు చెప్పుకొనని యిల్లులేదు. అతని నామ స్మరణము చేత నొక దానమైన చేసి యెఱుగని మహాకృపణులు సయితము ఔదార్యము గలవారై తెగించి తమ యర్ధమున కొంతభాగము దానము చేయక మానరు. భరత ఖండము గర్భమున బుట్టిన బిడ్డలలోఁ దన సత్కార్యములచేత నిజముగా జరితార్థుడైన పురుషు డితఁడే యని చెప్పవచ్చును.