పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/218

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
181
గోకులదాసు తేజ్‌పాలు

ఈ మరణశాసనము వ్రాయునప్పటికి గోకులదాసునకు నలువదియైదవ సంవత్సరము, ఏవిధమైన వ్యాధియులేక యతఁడు మంచి యారోగ్యము కలిగియుండెను, ఆ శాసనము వ్రాయవలసిన యవసర మేమియు లేకపోయినను గోకులదాసు "దేహము లస్థిరము, లెటుపోయి యెటువచ్చునో ముందే వ్రాసియున్న మంచి"దని సుఖముగా నున్నపుడె దానిని లిఖించెను. కాని దైవవశమున నది వ్రాసిన సంవత్సరమునకే గోకులదాసున కొకవ్యాధి ప్రవేశించి యేచికిత్సలకు లొంగక తుదకాయుదార చరిత్రు నెత్తుకొనిపోయెను. గోకులదాసు మహాదానముల నిమిత్తము వ్యయముచేసిన ధనముగాక మృతినొందునప్పటి కతనివద్ద ముప్పదియేడులక్షల రూపాయలుండెను. కాని పాప మతనికిఁ బురుషసంతానము లేకపోవుటచే భార్యకు బెంచుకొమ్మని యధికార మిచ్చెను.

ఎంత కట్టుదిట్టముగ వ్రాసిన మరణశాసనములైనను వివాదములు లేక యుండవుగదా! అట్లె గోకులదాసు మరణశాసన విషయమునగూడ ప్రారంభమున గొన్ని వివాదములు సంభవించెను? కావున నీవివాదములు వచ్చుటచే సొమ్ము ధర్మకర్తలచేతికి వచ్చునప్పటికి గొంత యాలస్యమయ్యెను. కాని యాయాలస్యముకూడ కొంత మేలేయైనది. ఏలయన తగవులన్నియు దీరునప్పటికి కర్చులతోను వడ్డీతోను సొమ్ము పదునైదులక్షలయ్యెను. గోకులదాసు చేసిన ధర్మకార్యము లన్నింటిలో మిక్కిలి యెన్నదగిన దొక్కటియున్నది. అది యిది, చదువుకొనఁ దలచు బీదవిద్యార్థులకు భోజనశాల యొకటి యతఁడేర్పరచెను. అందులో నిరువదియెనమండ్రు విద్యార్థుల కన్నముపెట్టి జీతములు పుస్తకములు బట్టలు మొదలగునవిచ్చి పట్టపరీక్షయందు గృతార్థు లగువరకు వారికి జదువుచెప్పించు నట్లేర్పాటులు చేయబడి