పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
12
మహాపురుషుల జీవితములువేతనముగల చిన్న యుద్యోగియయి యుండెను. ఈశ్వర చంద్రుఁడు తనయూర బడిలోయున్నంతవఱకు విద్య నేర్చుకొని తొమ్మిది సంవత్సరములు ప్రాయము వచ్చినపుడు సంస్కృత కళాశాలలో విద్య నభ్యసించుటకుఁ గలకత్తా నగరమునకుఁ బంపఁబడి యచ్చట ధర్మ శాస్త్రము, వేదాంతశాస్త్రము, కావ్యాలంకారములు, జ్యోతిశ్శాస్త్రము మొదలగు వానిని నేర్చి యనేకబహుమానము లందెను. అతఁడు తన పదియేడవయేట పండితకోర్టు మునసబుగా నుండఁదగిన పరీక్షయందుఁ దేరెను. ఆకాలమునం దాపరీక్షలో కృతకృత్యుఁ డగుట మిక్కిలి కష్టము. అతఁడా పరీక్షను దేరినతోడనే దొరతనము వారు వానికి న్యాయాధిపతి యుద్యోగము నొసంగిరి గాని యాయూరతిదూరమున నుండుటచే వాని తండ్రి కొడుకును దూరమునకుఁ బంపుట కిష్టము లేక యుద్యోగము మానిపించెను. అందుచేత విద్యా సాగరుఁడు మరిరెండు సంవత్సరములు కళాశాలలోఁ జదువుకొని సాంఖ్య వైశేష కాది షడ్దర్శనములు నేర్చి ప్రవీణుఁడయ్యె. 1833 వ సంవత్సరమున నాతఁడు చక్కని శైలితో చక్కని సంస్కృత వచనమును వ్రాసినందుకు నూరు రూప్యములును బద్యకవిత్వము జెప్పినందు కేఁబది రూప్యములును బారితోషికము బడసెను. మరుచటి సంవత్సరము నీశ్వర చంద్రుఁడు హిందూధర్మశాస్త్ర పరీక్షయందుఁ గృతకృత్యుఁడయి విద్య ముగించి విద్యాసాగరుఁడను బిరుదమును బడసెను. గీర్వాణభాష నభ్యసించెడు కాలముననే యప్పు డప్పుడించుక యింగ్లీషుభాషను సయిత మాతఁడు నేర్చికొనెను. ఈశ్వరచంద్రుఁడు మొట్టమొదట సంస్కృత కళాశాలలో వ్యాకరణపండితుఁడుగఁ గొంతకాలము పనిచేసి, పిమ్మట 1840 వ సంవత్సరమున ఫోర్టు విలియమ్ కళాశాలలో నెలకు నేబదిరూపాయలు జీతముగల ప్రధాన పండితుఁడుగా నియమింపఁబడెను. ఈ కాలమున దేశాభిమానులలో నగ్రగణ్యుఁడగు బాబు సురేంద్ర