పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

172

మహాపురుషుల జీవితములు

వంశపరంపరగా వచ్చుట యనుచితమని చెప్పి, యెప్పటికప్పు డొక పెద్ద నేర్పరుచుకొమ్మని యుపదేశించి తనమాట వారందఱు వినునట్లు చేసెను. అంతతోఁ బోనీయక వెనుక పెత్తనముఁ జేసిన శెట్టి మీఁద వ్యాజ్యము తెప్పించి యతనియొద్ద ధర్మవ్యయనిమిత్తఁమున్న సొమ్ము తీసికొని కులస్థులు ధర్మమునిమిత్త మిచ్చిన సొమ్ము యెక్కువ మంది యభిప్రాయము ననుసరించి వ్యయము చేయవలసినదే కాని యొక్క కులపెద్దమాట చొప్పుననే జరుగఁగూడదని యేర్పాటు చేసెను. మంగళదాసు నాథూభాయికి మొదటినుండియు విద్యాభివృద్ధిఁ జేయవలెననియభిలాష గాఢముగానుండెను. 1862 వ సంవత్సరమున బొంబాయిపుర వాసులగు కొందఱు పెద్దమనుష్యులు మగపిల్లల కొకపాఠశాల స్థాపింపదలప దాని కాతడు సహాయము చేసెను. హిందూ దేశములో పెద్దపరీక్షలయందు గృతార్థులయి పిదప విదేశము లందు జదువ నుద్దేశించువారి నిమిత్త మత డిరువదివేలరూపాయల బొంబాయి యూనివర్సిటీ వారికిచ్చెను. 1864 వ సంవత్సరమున మంగళదాసుభార్య మృతినొందెను. ఆమెజ్ఞాపకార్థ మతండు కళ్యాణ నగరమున నేబదివేలరూపాయిల వ్యయముచేసి యొక ధర్మవైద్యశాల గట్టించి దాని ఖర్చుల నిమిత్తము మఱి యిరువదివేల రూపాయిలు దొరతనమువారి చేతికిచ్చెను. పునహానగరములో డేవిడ్ సాసూ ననువారు కట్టించిన ధర్మవైద్యశాలలో గతిలేని హిందూ స్త్రీల నిమిత్త మొగభాగము మూడువేలు కర్చుపెట్టి మంగళదాసు కట్టించెను.

1860 వ సంవత్సరమున గవర్నమెంటువారు కొత్తగావచ్చు బడి పన్ను (అనఁగా ఇన్‌కంటాక్సు) ప్రజలమీద వేసినప్పుడావిషయ మయిన సంగతులు విచారణచేయుట కీతని కమీషనరుగా నియమించిరి. కాని యాపన్నెట్లు వేయవలయు నను నభిప్రాయములో నితనికి