పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/206

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
171
సర్. మంగళదాస్ నాథూభాయిలగు నా మహారాజులు గురువులని పేరుపెట్టుకొని నిజముగా మహారాజులకన్న నెక్కువ భోగము లనుభవించుచు మతము పేరుపెట్టి శిష్యులకు దుర్నీతులను బోధించుటయేగాక యెంత మోటవాండ్రయిన సిగ్గుబడ వలసిన నీతిబాహ్య కర్మముల స్వయముగఁ జేయు చుందురు. ఈ గురువు లందరుఁ వల్లభాచార్య మతస్థులు. ఈ యాచార్యులు చేయు దౌర్జన్యములు చూచి సహింపలేక మంగళదాసు వారి దుర్మార్గముల బయలుపెట్టఁ దలఁచెను. అతని తలంపున కనుకూలముగ నా కాలమున కెరనన్‌దాస్ మాల్జీయను యధార్థవాది యొకఁడు బయలుదేరి సత్య ప్రకాశిక యను నొకపత్రిక స్థాపించి యందులో నీ మహారాజులు చేయు నీతిమాలిన పనులను వెల్లడింపుచురాఁగా మంగళదాసువానికిఁ దోడ్పడి కుడిభుజమయి పనిచేసెను. ఆ మహారాజులలో నొకడు మాల్జీగారిమీఁదఁ బ్రతిష్టా నష్టమునకు వ్యాజ్యము తేగా నప్పుడు నాథూభాయి వానికభయ మిచ్చి వేయివిధముల కనిపెట్టుటయే గాక తాను వాని పక్షమున సాక్ష్యముఁగూడ నిచ్చెను. మంగళదాసు సాక్ష్యము నేరమును విచారించిన జడ్జీలకు మంచియభిప్రాయమును గల్గించెను. అందుచేత తీర్పువ్రాయునప్పుడు జడ్జీలలో నొక రిట్లనిరి. "తనమతములోఁ జాల దురాచారము లున్నవని దృఢమయిన నమ్మకము తన మనస్సులో లేనిపక్షమున మంచిస్థితియు గౌరవమును గల మంగళ దాసువంటి పెద్దమనుష్యుఁడు కోర్టుకు వచ్చి, కులస్థులయొక్కయు బంధువుల యొక్కయు దూషణకైన నోర్చి యేల సాక్ష్యమిచ్చును." అదివర కతని వర్ణమునకు వంశపరంపరగా వచ్చునట్టి కులపెద్ద యొకఁ డుండెను. వర్ణపుఁ గట్టుబాటులలో నతఁడెంత చెప్పిన నంతజరుగుచు వచ్చెను. వర్ణవ్యవహారములెల్ల నొక్కమనుష్యుని పెత్తనముమీఁద