పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/196

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
163
సర్. జేమ్సేట్జీ జీజీభాయివలలోఁ గూర్చున్నప్పుడున్నంత సౌఖ్యమైనను లేనిచోటుల గూలవేయుటయేగాక యెంత యనాదరణము సేయవలయునో యంత యనాదరణము చేసెను. మాకును మఱియేడుగురు మనుష్యులకును వంట చేసికొనుటకుఁ ద్రాగుటకు దినమున కొకకుండెడు నీ రతఁడు పంపుచు వచ్చెను. ఆయోడ యెక్కినది మొదలు పదునైదు దినములవఱకు మా మందభాగ్యముచేత మేము పడిన యిడుమ లిట్టిట్టివని నేను వ్రాయజాలను. తరువాత నాలుగైదు దినములకు (అనఁగా డిశంబరు 5 వ తారీఖున నర్థ రాత్రమున) మేము కలకత్తానగరము సురక్షితముగాఁ జేరితిమి."

ఇట్లు చచ్చిచెడి యెట్లో కలకత్తాచేరి జీజీభాయికొన్ని నాళ్ళచటనుండి బొంబాయినగరమునకుబోయెను. ఆ పురమున కొంతకాల ముండి మరల చీనాదేశమున కింకొకసారి నావికాయాత్రచేసి 1857 వ సంవత్సరము తిరిగివచ్చి బొంబాయిపురమునస్థిరముగఁ గాపురముండెను. అదిమొదలుకొని వర్తకసమయమున నతఁడు తిరిగి ప్రయాణము చేయ లేదు. ఆనగరమునందే యతఁడు ముగ్గురు భాగస్వాములతోఁ గలసి యొకవర్తక సంఘముస్థాపించి మిక్కిలి పాటుపడి జాగరూకతతో వ్యవహరించి 1827 వ సంవత్సరమునకు రమారమి రెండుకోట్లరూపాయలు సంపాదించెను. ఆహాహా! నూటయిరువదిరూపాయిలతో జీవయాత్ర నారంభించిన యీపేద యిరువదియైదు సంవత్సరములలో నెంత ధనికుఁడయ్యెనో చూడుఁడు. దీనికిఁగారణమేమి! మనకు దైవ మింతియేయిచ్చినని నింద్యమయిన సంతుష్టినొంది "కూపస్థమండూకమువలె" స్వదేశముననేయుండి యిడుమలఁబడక పిన్న నాటనుండియు విదేశములలోవిరివిగా వాణిజ్యమును సేయుటయే దీనికిఁ గారణము.