పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

మహాపురుషుల జీవితములు

కారితో జెప్పనా నావమీఁద స్థలము లేదని యతఁడు బ్రత్యుత్తర మిచ్చెను. మేమేదోయొక మూల నిరికికూర్చుండి కాలక్షేపము జేయఁగలమని మరల వారికి వర్తమానమంప నతఁ డంగీకరించి నన్నును నాతోనున్న తురకవానిని నావయెక్కించుకొనుటకు నెనిమిదివందల డాలరులు (అనగా రెండు వేలరూపాయలు) కావలయునని యడిగెను. ఈ యోడ కిరాయి మిక్కిలి యెక్కువగా నున్నదని యభిప్రాయపడి గ్రాంటుదొరగారు కొంతతగ్గింపుమని మాపక్షమునబూని కొంతవఱకు వాదించిరి. కాని యాయోడ యధికారి పట్టినపట్టు విడువనందున గ్రాంటుగారు స్థితిగతులుచూచి యాయోడ దాఁటిపోయినచో మరల నేయోడయు దొరకదనియు దొరకినను కిరాయి యింతకంటె తక్కువ యుండదనియు నీ నడుమ గొఱ్ఱెమాంసము దక్క భోజనపదార్థము లేవియు దొరకవు గావున మిక్కిలి యవస్థ పడవలసియుండు ననియు జెప్పి యా బేరము నొప్పుకొమ్మని నా కుపదేశించిరి. ఆయుప దేశమును శిరసావహించి తురకయు నేనును చెరి యెనిమిదివందల శిఖారూపాయిలు కలకత్తాలో నోడయధికారుల కిచ్చునట్లొప్పుకొని పత్రముల వ్రాసియిచ్చి యోడయెక్కితిమి. మొదట మేమెక్కిన యోడలోనుండి యొకబియ్యపుబస్తా నెట్లయిన మాకిప్పించుమని వేడుకొంటిమి. అతఁ డట్లేయని యాయోడయధికారి కొక చీటివ్రాసి పంప నతఁడు మా కోరిక నిరాకరించె. అప్పుడు ముప్పదిడోలరులకు మేము మణుగున్నర బియ్యము కొంటిమి. అదిగాక నేను వెనుక దొంగతనముగా దాచుకొన్న బియ్య మొక యరబస్తాయుండెను. ఈసరకులతో బయలుదేరునప్పుడు గ్రాంటుదొరగారు మే మెక్కిన యోడయధికారితో మమ్ము దయతో నాదరింపుమని చెప్పెను. ఎవ రెంత జెప్పినను మాదురదృష్టము మమ్ము విడువదయ్యె పదునాఱువందల రూపాయలు పుచ్చుకొని యాయోడయధికారి తురకను నన్ను సామాన్యపు డింగీపడ