పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/194

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
[21]
161
సర్. జేమ్సేట్జీ జీజీభాయిసించితిమి. మాలో 'టర్నర్‌' అను పేరుగల యొక యింగ్లీషు దొరగా రుండిరి. ఆయనవద్ద మూడువేల డోలరుల సొమ్ముండెను. ఆ సొమ్ముతో మేము కొంతకాలము గడపితిమి. ఒక డోలరు రెండు రూపలన్నరకు సమానము. ఆదినములలో బెద్దబియ్యపు కాటకము సంభవించుటచే ముప్పదియైదు డోలరు లిచ్చినను మాకొక బియ్యపు బస్తా దొరకుట యరుదయ్యెను. అందుచేత నొక్కొక్క మనుష్యుడు దినమున కరపౌనుబియ్యముకంటె నెక్కువతినగూడని నియమ మేర్పఱచుకొంటిమి. గొఱ్ఱెమాంస మొకటిమాకు కావలసినంతలభించుచు వచ్చెను. ఈవిధముగా గష్టములఁబడుచు గ్రాంటుదొరగారిదయచేత మేమెట్టులో మఱియొకయోడ నెక్క గలిగితిమి. మందభాగు లెక్కడికి బోయినను విపత్తులు విడవవుగగా! ఆయోడ కలాసులకు మాపై నిర్హేతుకాగ్రహముగలిగెను. అందుచేవారు మమ్మవమానింపఁదొడఁగిరి. అంతియగాక నేను నాతోనున్న నలుగు రింగ్లీషువారు మఱియొక మహమ్మదీయుఁడు మేమాఱుగురముగలసి తన్ను జంపుట కొకకుట్ర పన్ను చున్నారమని మాపయి ననుమానపడి యా యోడ యధికారి మాకు సంకిళ్ళు వేయించి యంతతో బోక మాకింకను దారుణదండన విధింతునని బెదరించెను. కీడులో మేలన్నట్లు నాతోనున్న నలువురి దొరలలో నొకనికి ఫ్రెంచిభాష వచ్చియుండెను. ఆభాషతో నతఁడు నావ యధికారితో మాస్థితిగతుల విస్పష్టముగ జెప్పి మాసామానులు పరీక్షింపుమని వేడగా నతడు సరేయని శోధించి మావద్ద ప్రాణములు తీయు నాయుధము లేవియు లేవని గ్రహించి మమ్ము విడిచి పుచ్చెను. ఇట్లు మాకష్టము లనంతములయి యుండెను. అటులుండ నాసమయమున డెన్మార్కు దేశమువారి యోడ కలకత్తాకు బోవు చుండెను. గ్రాంటుదొరగారు మమ్మాయోడమీద నెక్కించి బంగాళాదేశమునకుఁ బంపుదుమని వాగ్దానముచేసి యాయోడ యధి