పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/193

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
160
మహాపురుషుల జీవితములునాలుగుసారులు పోయెను. అందు 1806 వ సంవత్సరమునఁ జేయఁబడిన కడపటి ప్రయాణము కొన్ని యపాయములతో నిండి యున్నది. ఆ ప్రయాణమున బ్రన్సువిక్కను పేరుగల యోడమీఁద దా ననుభ వించిన కష్టము లన్నియు జీజీభాయి గుజరాతీ భాషలోఁ దన మిత్రుని కొక యుత్తరము వ్రాసెను. ఆ యుత్తరము లోని సంగతులఁ గొన్నిఁటి నిందుఁ బొందుపరచు చున్నాము.

"మే మెక్కిన యోడను ఫ్రెంచివారు పట్టుకొనిరి. మా దురదృష్టమునకుఁ దోడు మా యోడ కొంతనడచి మెరకయెక్కెను. ఒడ్డునకు మమ్ము బోనిమ్మని యోడమాలిమిని మే మెంతయు బ్రతిమాలితిమిగాని తన పై యధికారి యుత్తరువు లేదని యతడు మా కోరిక నిరాకరించి కొంతదూరము సాగిపోయిన వెనుక మమ్ము దిగనిచ్చి మా సరకులు మా కిచ్చెదమని వాగ్దానము చేసెను. ఆ మరునాఁడు అడ్మిరల్ (అనఁగా నావకు సర్వాధికారి) మాకు దర్శనమియ్య మా సిలుగుల మేము వానికివిన్నవించుకొని మమ్మొకదరిఁ జేర్పుమని ప్రార్థించితిమి. ఆయన మాయం దనుగ్రహించి మా మూటలు ముల్లెను పుచ్చుకొమ్మనియెను. గాని మా వర్తకపు సరుకులు మాత్రము మాకియ్య నొల్లడయ్యెను. ఆయన పిమ్మట నావద్దనున్న బియ్యపుమూట రెండు మల్లుతానులు మొదలగు కొన్ని వస్తువులం దీసికొని నా బట్టలపెట్టె నాకిచ్చెను. బియ్యపుబస్తా యొకటి యిమ్మని నేను వేడుకొంటిని గాని యా మహాత్ముఁడు నా మొఱ వినఁడయ్యె. అప్పుడు నా సరకులన్నియు నొక పెట్టెలో వేసికొని తక్కిన వారితోఁ గలిసి యోడ దిగిపోతిని. ఓడదిగి యొడ్డు చేరిన పిదప మేము 'కెప్టెన్ గ్రాంటు' అను నొక యింగ్లీషు నావికుని జూచితిమి. ఆయన మా యలమటవిని జాలిపడి యెంతయు నాదరించె. ఎట్లయినను ఫ్రెంచివారిచేతనుండి తప్పించుకొంటిమని సంత