పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మానమోహన ఘోషు

135

సంవత్సరమున ఇంగ్లాండు ప్రజలకు మన దేశస్థితులను జక్కగా విన్నవించుటకు మనవా రొక్కొక్క రాజధానినుండి యొక్కొక్కని బంపదలంచి బంగాళమునుండి మానమోహనుని బంపిరి. హిందూ దేశీయ మహాసభ పుట్టినది మొదలు మానమోహనునకు దానియం దభిమానమే యుండెను. అందుచే 1890 వ సంవత్సరము నందు కలకత్తా నగరమునందు జరిగిన యాఱవ దేశీయ మహాసభ నిర్వహించుట కేర్పడిన సమ్మాన సంఘమున కిత డధ్యక్షుడయ్యెను. అంతేగాక 1896 వ సంవత్సరమున క్రిష్ణఘరు నగరములో జరిగిన బంగాళా రాజధానిసభ కధ్యక్షుడుగ నియమింప బడెను. హిందూ దేశమునం దిప్పటికిని కలక్టర్లకు సిస్తు వసూలుచేయు నధికారమే గాక నేరముల విచారించి దోషుల శిక్షించు నధికారము గూడ కలదు. ఆ రెండధికారము లొక పురుషునియందే యుండుటచేఁ బ్రజలకు విక్కులు మిక్కిలి సంభవించుచున్నవని నమ్మి మానమోహనుఁడా యధికారము వేఱు వేఱు పురుషుల కియ్యవలసినదని పట్టుపట్టి వాదించెను.

దేశీయమహాసభలో చర్చింపఁబడు నంశములలోనిది ప్రధానమైనది. ఆ విషయమున మానమోహనఘోషుయొక్క వాక్యములు ప్రమాణములు. అతఁడు 1895 వ సంవత్సరమున నింగ్లాండునకుఁ బోయి యీయంశ మాదేశస్థులకు నచ్చఁజెప్పెను. ఆసంవత్సరమున పునహానగరమున జరుగు దేశీయమహాసభకు వచ్చుటకు వీలుండదేమో యను భయమున త్వరపడి స్వదేశమునకు వచ్చి యాసభలో కూడ యీ యంశమును విపులముగఁ జర్చించెను. అనంతర మతఁడు కలకత్తాకువచ్చి రివిన్యూ మేజస్ట్రీటు యధికారములు రెండును జేతిలోనున్న యుద్యోగస్థులు చేసినతీర్పులను వానిలో జరిగిన యన్యాయ