పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/165

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
134
మహాపురుషుల జీవితములు

తఱుచుగ క్రిమినలు వ్యవహారములలో బనిచేయుచు గొన్నియెడల ముద్దాయీలవద్దనుండి ధనము గ్రహింపకయే ధర్మార్థము పనిచేయుచు నిరపరాధుల బెక్కండ్ర నురినుండి దప్పించి పుణ్యము గట్టుకొనెను. బంగాళమునందున్న పోలీసువారియొక్కయు మేజస్ట్రీటుల యొక్కయు నక్రమములను బలుమారతడు వెల్లడిచేయుట జేసి వారి కితని పేరీశ్వర వేరైయుండెను. 1882 వ సంవత్సరమున నవద్వీపము నందు వసియించు మాలక చంద చౌకిదారను నిరుపేద రహితు మీద తొమ్మిదియేండ్ల వయసుగల తన బిడ్డను చంపినట్లు నేరము మోపబడి శిక్ష వేయంబడెను. ఆ వ్యవహారములో మానమోహనుడు ధర్మార్థము పనిచేసి చాల శ్రమపడి శిక్ష కొట్టివేయించి వానిం బ్రతికించెను. ఇది యొక్కటియేగాదు. వ్రాయదలంచుకొన్న నతడు చేసిన ధర్మకార్యము లనేకములు గలవు.

మానమోహనుడు చేసిన మేలు మరువక యా కాపువా డా ఋణము సంవత్సరమునకు రెండుసారులు మానమోహనుని దర్శనముచేసి యోపికకొలది వానికి బహుమానము లిచ్చుచు వచ్చెను. సాక్షుల నడ్డుప్రశ్నలు వేయుటలో మానమోహనున కధిక ప్రజ్ఞ గలదని చెప్పుదురు. ఒకమారొక డిప్యూటీకలెక్టరుగారొక వ్యవహారమున సాక్షిగ వచ్చి మానమోహనుని ప్రశ్నలధాటి కాగజాలక యొకమాట కొకమాట సంబంధము లేన ట్లవకతవకల నెన్నేని పలికి చిట్టచివఱకు సంభ్రాంతుడై మూర్ఛపోయెను.

ఈయనకు జిన్న తనమునుండియు స్త్రీవిద్యయం దత్యంతాభిమానము గలదు. ఆ కారణమున 1873 వ సంవత్సరము మార్చినెల యందతడు బెత్యూనుకాలేజీ వ్యవహారముల జూచుటకు దత్పరిపాలనాసభలో నొక సభ్యుడయ్యెను. పిమ్మట గొన్నినాళ్ళకత డాసభకు గార్యదర్శియై దత్కార్యముల నతిశ్రద్ధతో నిర్వహించెను. 1885 వ