ఈ పుట ఆమోదించబడ్డది
126
మహాపురుషుల జీవితములు
మొదటినుండియు బూర్వాచార పరాయణుఁడు, సంఘసంస్కారము బ్రహ్మసమాజమతము మొదలైన వతని కంతగా కిట్టవు. ఇతఁడు వయసు ముదిరినకొలది మతమునం దత్యంతాసక్తిగలవాడై కృష్ణుని మహిమలు గొనియాడుచు నొక గ్రంథము వ్రాసెను. అందు శ్రీకృష్ణుడు సద్గుణ సంపన్నుడనియు నతనిం గూర్చి భాగవతాది గ్రంథములలో వ్రాయబడినదంతయు గేవలము కవి కల్పితమగు నబద్ధమనియు నతడు వ్రాసెను. ఈయన వేదములం జక్కఁగఁ జదివినవాఁడు. ఈయనకు గవర్న మెంటువారు రాయబహద్దరనియు సి. ఐ. ఇ. అనియు బిరుదుల నిచ్చిరి. ఈయన 1894 వ సంవత్సరమున మృతినొందెను.