పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బంకించంద్రచటర్జీ

125

వ్రాతలను ఖండించిరి. కాని యతడు వారి విమర్శనములను జూచి వగవక తనపూనినపని మానక బంగాళీభాషకుఁ జిత్రవచన కావ్యము లనియెడు క్రొత్తయలంకారములను దెచ్చిపెట్టెను.

తరువాత నతఁడు మరికొన్ని వచనకావ్యములనుగూడ రచించెను. అందు ముఖ్యమయినవి కపాలగుండల యనునదియు మృనళినీ యనునదియు, కపాలకుండలయను కథ కేవల కల్పితమయి శాక్తేయ మతమునందుగల ఘోరకృత్యములనే వెల్లడిచేయును. మృనళినీ బంగాళీల యాచార్య వ్యవహారములఁ దెలుపునట్టికథ. 1872 వ సంవత్సరమున బంకించంద్రుఁడు వంగదర్శినియను పత్రికను ప్రకటింప నారంభించెను. ఇది కేవలము విద్యావ్యాసంగములు గలదై జనరంజకమై స్వల్పకాలముననే యనేకులచేత జదువబడుచు బ్రసిద్ధి కెక్కెను. అదివఱకతఁడు వ్రాసిన వచనకావ్యము లన్నియుఁ బూర్వవృత్తాంత ములనే దెలుపుచు వచ్చినందున నన్నియు నొక్కవిధముగానే యుండఁగూడదని బంగాళీదేశమున నాకాలమున సంఘస్థితి యెట్లున్నదో దానిని వర్ణించు నొకటి రెండు గ్రంథములను వ్రాసెను. అవి వంగదర్శినిలో బ్రకటింపబడి మిక్కిలి రసవంతములై యున్న యవి. సంఘస్థితిని వర్ణించిన వచనకావ్యములలో విషవృక్ష మనునది మిక్కిలి చిత్రమయినది. అదియు వంగదర్శినియందు నెలనెలకు బ్రకటింపఁ బడుచు వచ్చెను. దాని రమణీయకమునుబట్టి యది యింగ్లీషుభాషలోనికిగూడ తర్జుమాచేయబడినది. ఆకారణమున బంకించంద్రునిపేరు ఫ్రెంచివారికి నింగ్లీషువారికిఁ దెలియవచ్చెను.

ఇతఁ డింక ననేక వచనకావ్యములు రచించె. అందు ముఖ్యమయినవి దేవీచందూరాణీ ఆనందమఠము మొదలగునవి. ఇతడు