పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

మహాపురుషుల జీవితములు

ప్రాసమగు కవిత్వము చెప్పబూనుకొనెను. ఎంతకృషి చేసినను బంకించంద్రునకుఁ గవిత్వములో మధుసూదనున కలవడిన లలితశయ్య యలవడకపోవుటచే నది తనకుఁదగదని మానుకొని వచనకావ్యములలో గృషిచేయ మొదలుపెట్టెను.

చటర్జీ యింగ్లీషుభాషలోని చిత్రవచనకావ్యములను (Novels) విసుపును తనివియు లేక యహోరాత్రములు చదువుచుండెను. అందులో 'సర్ వాల్టరుస్కాటు' అను మహాకవి రచియించిన వీరరసప్రధానము లగు చిత్రవచనకావ్యములయం దతనికి మిక్కిలి తమకము. అవి చదివినపిదప స్కాటు వ్రాసిన గ్రంథములను మరల బంగాళీభాషలో వ్రాయుట యసాధ్యమయినను స్కాటు మార్గము ననుసరించి స్వభాషలో స్వకపోలకల్పితముగఁ గొన్ని చిత్రవచన కావ్యములు వ్రాయవచ్చునని నమ్మి యతఁ డాపనికిఁ బూనుకొనెను. 1864 వ సంవత్సరమునం దతఁడు దుర్గేశనందిని యను దేశచరిత్ర గర్భితమయిన మొట్టమొదటి చిన్నవచనకావ్యమును రచించెను. అదియే యిప్పటికిని బంగాళీవచన కావ్యములలో నగ్రగణ్యమని కొనియాడబడుచున్నది. ఇందలికల్పన మతిచిత్రము. స్థలపదార్ధాది వర్ణనము శ్లాఘ్యము. కథ మిక్కిలి మనోహరము బంగాళాభాషలో మరల నటువంటి కల్పితవచనకావ్యమిప్పటికిం బుట్ట లేదు. మధుసూదనదత్తును బరిహసించినట్లె బంకించంద్రునిగూడ జనులు క్రొత్తమార్గమున వచనకావ్యములు నిర్మించినందుకు బరిహసించిరి. పట్టుమని పదిబంతులు సరిగ వ్రాయుటకు సమర్థులుండరుగాని సరసముగ నొకరు వ్రాసినదానిని విమర్శకులమని పేరు పెట్టుకుని నిందించి యపహాస్యము చేయుట కనేకులుందురుగదా! బంకించంద్రుని గ్రంథమును శైలి మనోహరముగా లేదనియు సందర్భసిద్ధి పొందబడలేదనియు వర్ణనము లుండవలసి నట్లుండ లేదనియుఁ గొందఱు పండిత మనుష్యులు వాని