పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బంకిం చంద్ర చటర్జీ

ఇతఁడు 1838 వ సంవత్సరమున జన్మించెను. వానితండ్రియగు యాదవచంద్ర చటర్జీ యింగ్లీషు ప్రభుత్వవారిక్రింద నొకడిప్యూటీ కలక్టరుగా నుండెను. బంకింగుచంద్రుఁడు మొదట నింగ్లీషు హుగ్లీ కాలేజీలోఁ జదువుకొని పిమ్మట విద్యాసమాధికై ప్రసిడెన్సీకాలేజికిఁ బోయి చదివెను. బంగాళాదేశమునందు మొట్టమొదట బి. యే పరిక్షయందుఁ గృతార్థుఁడైన విద్యాకుశలుఁ డితఁడే. అతడు తొలుదొల్త పత్రికాధిపతిగానుండి జీవితకాలముగడుపఁ దలఁచెను. ఈతలం పుండుటచేతనే ఆతఁడు బి. యే. పరీక్షయందుఁ గృతార్థుఁడు గాకమునుపే 'ప్రభాకర' యను స్వభాషాపత్రికను నడుపుచున్న యీశ్వరచంద్రగుప్తుఁ డనువానివద్దకుబోయి పత్రిక నడుపుపని కొంతకాలము నేర్చికొనియెను. కాని యతఁడు తాననుకొన్నట్లు పత్రికాధిపతి గాఁ డయ్యె. యేలయన పట్టపరీక్షయందుఁ దేరినతోడనే గవర్నమెంటువారు వానికి డిప్యూటీ కలక్టరుపని నిచ్చెదమన జీతమున కాసపడి యతఁడా యుద్యోగమున, జేరెను.

పత్రికాధిపతి కాఁదలఁచుకొన్నందువలన వానికొన లాభముఁ గలిగెను. ప్రభాకరపత్రికాకార్యస్థానమున నున్న కాలముననతఁడనేక స్వభాషాగ్రంథములు చదువవలసి వచ్చినందునఁ గొంతపాండిత్య మతని కందులోఁ గుదిరెను. దానింబట్టి యతఁడు వచనగ్రంథములను జేయ సమర్థుఁడై గొప్పయుద్యోగములోనున్న దీరికచేసికొని గ్రంథరచనా వ్యాసంగమును మానక చేయుచుండెను. మహాకవి యగు మదుసూదనదత్తు బంగాళీభాషలో మృదుమధురకవిత్వము చెప్పి యానాటి గొప్పకవులకుసయితము నాశ్చర్యమును గలిగించు చుండెను. బంకించంద్రుఁడు మధుసూదనదత్తు ననుసరించి నిర్యతి