పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[16]

మధుసూదనదత్తు

121

వలన విడుదల పత్రిక పుచ్చుకొని మఱియొక దొరసానిని పెండ్లి యాడెను. ఈరెండవ భార్య వానికిమిక్కిలి యనుకూలమై ప్రవర్తించుటయేగాక వాని సుఖదుఃఖములను సమానముగ ననుభవించి యతనికన్న మూడుదినములు ముందుగామృతినొందెను. ఈ రెండవ భార్యవలన వాని కిరువురు కొమారులు గలిగిరి.

మధుసూదనదత్తు బంగాళాదేశములో పందొమ్మిదవ శతాబ్ద మందలి మహావిద్యావంతులలో నొకఁడు. ఆతఁడు మహాకవియేగాక గొప్ప సాహిత్య చక్రవర్తి. హిందూకళాశాలలోఁజదువు కాలమునఁ నతఁ డింగ్లీషును పారసీభాషను జదువుకొనెను. బిషపు కాలేజీలో గ్రీకు లాటిను సంస్కృతమును నేర్చెను. చెన్నపురమం దున్నపుడు తెనుగును ద్రావిడమును నభ్యసించెను. యూరపుఖండమునకు వెళ్ళినప్పుడు ఫ్రెంచి జర్మనీ ఇటాలియను హీబ్రూ భాషలయందుఁ బ్రవేశము సంపాదించెను. బంగాళీభాష వచ్చుననిమనము వేరుగ చెప్ప నక్కరలేదు గదా!

మధుసూదనదత్తున కుపకారము చేసిన మిత్రులలో నిద్దఱు ముఖ్యులు గలరు. ఒకఁడు మనోమోహనఘోషు. రెండవ యతఁ డీశ్వరచంద్ర విద్యాసాగరుఁడు. ఒకమారు మధుసూదనదత్తు ఋణబాధచేతఁ జెరసాలకుఁ బోవలసినవాఁడై యుండగా నాసొమ్ము ఋణప్రదాతలకిచ్చి విద్యాసాగరుఁడు వానికికారాగృహబాధ తప్పించెను. మధుసూదనుడు తన మరణకాలమున దిక్కుమాలిన తన యురువుర కుమారులను మనోమోహన ఘోషునకు నప్పగించెను. ఆయన చందాలు వేయించి సొమ్ము పోగుచేసి తల్లిదండ్రులు లేని యాబిడ్డలను పెంచి పెద్దవారిగ జేసెను.

మైకేలు మధుసూదనదత్తుయొక్క జీవితచరిత్రము నెఱిఁగిన వారందఱు నేర్చికొనవలసిన మంచినీతు లొకటి రెండు గలవు. అతి