పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/132

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
107
రాజేంద్రలాలుమైత్రా

ఈ సంపుటములు హిందూదేశ ప్రాఁచీనవిషయములు సంస్కృతము నుండి చేసిన భాషాంతరీకరణములు స్వతంత్రముగ బంగాళి భాషలో రచించిన గ్రంథములు సభలో నిచ్చిన యుపన్యాసములు పత్రికలకు వ్రాసిన సంగతులు గలవై యాతని సర్వతోముఖ పాండిత్యమును వెల్లడి చేయుచున్నవి.

1885 వ సంవత్సరమున ఏషియాటిక్కు సంఘమునఁ కతఁ డధ్యక్షుఁడయ్యెను. అదివఱకు హిందువుల కెవరికి నంతటి గౌరవము పట్టియుండలేదు. కావున రాజేంద్రలాలు మైత్రున కింతటి గౌరవము కలిగినందులకు దేశస్థులందఱు మహానందభరితులైరి. 1886 వ సంవత్సరమున కలకత్తాలో దేశీయమహాసభ జరిగెను. అది రెండవ సభ. హిందూదేశము నంతనుండియు దేశీయమహాసభకుఁ ప్రతినిధులుగా వచ్చు పెద్దమనుష్యులను సన్మానము చేయుటకై యొకసభ యేర్పడెను. ఆసభకు నగ్రాసనాధిపతిగా నుండుటకు రాజేంద్రలాలు మైత్రునికంటె నర్హుఁడు లేఁడని కలకత్తానగరవాసులు వాని నైక కంఠ్యముగ నధ్యక్షునిఁ జేసిరి. ఇంతియగాక యతఁడు బ్రిటిషు యిండియా సంఘమునకుఁ గూడ నగ్రాసనాధిపతియై యుండెను. ఈ సంఘములో బంగాళా దేశమునందుఁ గల గొప్ప జమీందారులు విద్యావంతులు సభికులుగా నుండిరి. అట్టి సంఘమున కతఁడు సభాధ్యక్షుఁడుగా నుండుటచేతనే జనుల కతనియం దెంత గౌరవమున్నదో తెలిసికొనవచ్చును.

ఈ సంఘము దేశమున కెంతయు నుపకారముఁ జేసినది. ఇట్లు చేయుటకు సభాధ్యక్షుఁడగు రాజేంద్రుఁడే ముఖ్యకారణమని ప్రజలనుకొనిరి. అతని పాండిత్యమును పరిశ్రమను గనిపెట్టి హిందువులేగాక యితర దేశస్థు లనేకులు వానిని తమతమ దేశములందున్న విద్యావిషయక సభలలో సభ్యునిఁ జేసికొనిరి. కలకత్తా యూనివరు