పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[14]

రాజేంద్రలాలుమైత్రా

105

వేయఁ బడుటయు రాజేంద్రలాలున కుపకారవతన (పించను)మిచ్చుటయు సంభవించెను.

రాజేంద్రలాలు దొరతనమువారు తనకప్పగించిన యాపనిని మిక్కిలి శ్రద్ధగాను ప్రభువులకుఁ దృప్తికరముగాను నిర్వర్తించెనని చెప్పుకొనక తప్పదు. అప్పటి బంగాళా గవర్నరుగారు జమీందార్ల పాఠశాలవిషయమున రాజేంద్రుఁడు చేసిన పనిని మెచ్చుకొనుచు నిట్లువ్రాసెను. ఇట్లు పాఠశాలను పరిపాలించుట మిక్కిలి కష్టసాధ్యమయిన పనియయినను బాఠశాలఁ గాంచిన వృద్ధి దాని పరిపాలకునకు మిక్కిలి ప్రతిష్ఠఁ దెచ్చుచున్నది. ఈకాలమున బంగాళాదేశములో చక్కగ వ్యవహరించుచున్న జమీందార్లనేకులు గలరు. వారందఱు రాజేంద్రలాలుమైత్రాయొక్క శిష్యులే యగుటచేఁ దమకట్టి సామర్థ్య మీరాజేంద్రుని శుశ్రూషవల్లనే గలిగినదని యొప్పుకొని తమకృతజ్ఞత ననేక పర్యాయములు చూపియున్నారు.

రాజేంద్రలాలుమైత్రా కేవలము ప్రాచీన విద్యలయందె తన కాలముబుచ్చెను. అతఁడు చేసిన పరిశ్రమయంతయు నేషియాటిక్కు సంఘమువారి మాసపత్రికలోను తదితర పత్రికలలోను స్పష్టముగ గనఁబడును. అతఁడు రచియించిన గ్రంథములలో ముఖ్యమైనవి ఉత్కలదేశ ప్రాచీనచరిత్ర బుద్ధగయప్రాచీన చరిత్రయనునవి రెండు. యప్పుడప్పుడు అతఁడు వ్రాసిన వ్యాసములు "ఇండోఆర్యనులు" అనుపేర రెండు సంపుటములుగ ముద్రింపఁబడి యున్నవి. ఆయన మునిసిపల్ కమీషనరుగా కూడ నుండెను. ఆయుద్యోగమున నతఁడు కావలసినంత స్వాతంత్ర్యములఁజూపి న్యాయముకొఱకుఁ బోరాడుచు వచ్చెను. అప్పుడప్పుడాయన హిందూపేట్రియేటు పత్రికకుఁ గూడ కొన్నిసంగతులు వ్రాయచుండువాఁడు. కృష్ణదాసుపాలుని మరణాంతరమున పేట్రియేటు పత్రిక నితఁడె నడపెనని చెప్పవచ్చును. కాని