పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
4
మహాపురుషుల జీవితములునిందకు జంకిన బందుగులును, మగఁడు చనిపోవుటచే సగము చచ్చి యున్న యాడుదానివద్దఁ జేరి మృతభర్తతో సహగమనముఁ జేసిన దానికిఁ బుణ్యము గలుగుననియుఁ గుటుంబమునకుఁ సత్కీర్తి సంఘటిల్లు ననియు, వేనోళ్ళఁ బొగడి మనసువిరిచి భయముపెట్టి, బలవంతముగ నాస్త్రీచే నొప్పించియు, నొప్పుకొననిచో విరిచికట్టియు స్మశానమునకుఁ దామె దీసికొనిపోయి మండుచున్న నిప్పులపైఁ బడవేసి హృదయము గరిగించు నామె యేడ్పు లెవ్వరికి వినఁబడ కుండ భేరీలు వాయింపించి, నడుమ నడుమ దుస్సహమగు బాధచే నామె లేవఁబోయినప్పుడు, వెదురుకఱ్ఱలచేఁద్రొక్కి యడచిపెట్టించి యెట్లో నిండుప్రాణముఁ దీసి, కృతార్థులగుచు వచ్చిరి. 1815 వ సంవత్సరము మొదలు 1828 వ సంవత్సరమువఱకు నొక్క కలకత్తా నగరమునందే దాదాపుగ నైదువేలమంది సుందరు లూఘోరమరణము పాలైరి. అశాస్త్రీయము నతిక్రూర మనార్యము నగు నీప్రత్యక్ష రాక్షస కృత్యములఁ జూడలేక రామమోహనరాయ లాదురాచారమును మాన్పుటకయి ప్రయత్నింప నిశ్చయించుకొని కలకత్తా నగరము వచ్చినది మొద లావిషయమయి పాటుపడి, యా యాచారమును తుదముట్టించి భరతఖండ స్త్రీల కుపకారము చేయుఁడని దొరతనమువారికి, పలుమారు మహజర్లు బంపియుఁ దద్విషయమయి తాను కొన్ని చిన్న గ్రంథములను వ్రాసియు, నుపన్యాసము లిచ్చియుఁ, బండితులతో వాగ్వాదములు చేసియు, జనులకు దాని క్రౌర్యమును బోధింపసాగెను. కొద్దిమంది జనులు రామమోహనరాయలు పక్షము వహించిరి గాని, లక్షోపలక్షలు పూర్వాచార పరాయణులయి సహగమనము లేకపోయినచో హిందూ మతము చెడిపోవుననియు, సనాతనమయిన యాయాచారమును కొట్టి వేయక నిలుపవలసినదనియు ప్రభుత్వమువారికి మరల మహజర్ల బంపిరి. ఛాందసులగు పండితులు, రామమోహనరాయలను నిందించుచు గ్రంథముల వ్రాసి ప్రజల మెప్పు గనిరి. అప్పటి