98
మహాపురుషుల జీవితములు
లోనే యాపని మానుకొనెను. అది మానుకొనిన కొన్నాళ్ళకు మిలిటరీ ఆడిటరుగారి కచేరీలో ననగా సేనల కర్చులు వ్రాయునట్టి కచేరిలో నెల కిరువదియైదు రూపాయలు జీతముగల యుద్యోగమతనికి దొరికెను. ఆ యుద్యోగమునం దాయన నిరుపమానమైన బుద్ధుకుశలతను శ్రద్ధను పైయధికారులయెడ వినయమునుఁ జూపుటచే నతని తెలివి తేటలు గ్రహించి వానికి గ్రమక్రమముగా నధికారులు నాలుగువందల రూపాయలవఱకు జీతము వృద్ధి చేసిరి.
ఉద్యోగములోఁ బ్రవేశించినను ముకర్జీ సాయంకాలములందును మఱియు తీరికయైనపుడెల్లను భాషాభివృద్ధికొఱకై యింగ్లీషు గ్రంథములను వార్తాపత్రికలను విసువులేక చదువుచువచ్చెను. గొప్పవారి యుపన్యాసములు వినుటయందు మిక్కిలి యాసక్తిగలవాఁడగుటచే నతఁడు భవానిపురమునుండి నాలుగుమైళ్ళునడచి కలకత్తాకు వచ్చి డాక్టరు డఫ్‌దొరగారి యుపన్యాసములువినిపోవుచుండువాఁడు. కలకత్తాలోనున్న పుస్తకభాండార సమాజమందు తానునొకసభ్యుడుగాఁజేరి యందున్న పుస్తకములన్నియుఁ జదివెను. ఆయుద్యోగములో ప్రవేశింపకమునుపే యతఁడు కొన్ని వార్తాపత్రికలకుఁగొన్ని వృత్తాంతములనువ్రాసి పంపుచువచ్చెను. 1853 వ సంవత్సరమున కలకత్తానగరవాసులు ఈస్టిండియాకంపెనీవారికి మహజరొకటిపంపఁ దలఁచి దాని నింగ్లీషుభాషలో మృదుశైలితో వ్రాయఁగలవాఁడు హరిశ్చంద్రముకర్జీ యొక్కడేయని యతనినాపనియందు నియోగించిరి. దీనింబట్టి వాని కింగ్లీషుభాషయం దెంతపాండిత్యముగలదో మనము తెలిసికొనవచ్చును.
1854 వ సంవత్సరమున కలకత్తానివాసులగు శ్రీనాథగోషు గిరీశచంద్రగోషు ఖెట్న చంద్రగోషు నను ముగ్గు రన్నదమ్ములు, హిందూపేట్రియేటనుపత్రికనుఁ బ్రకటింపఁబూనిరి. హరిశ్చంద్రముకర్జీ