పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదాస్‌పాలు

95

నందును కృష్ణదాసుపాలునివంటివారు మిక్కిలి తక్కువగానున్నారు. ఇంగ్లాండులోనే పుట్టిపెరిగి యింగ్లీషునే స్వభాషగా నభ్యసించిన పెక్కుదొరలకంటె కృష్ణదాసుపాలునకే యింగ్లీషుభాష యెక్కుడు వశమైనట్లు కనఁబడునని యింగ్లీషువార్తాపత్రికలే కొన్నివ్రాసినవి.

కృష్ణదాసుపాలుని మరణమును గూర్చి దేశస్థులందఱు విచారించిరి. అప్పటి గవర్నరు జనరల్ గారగు రైఫన్ ప్రభువుగారు శాసన నిర్మాణసభలో కృష్ణదాసుని మరణమును గూర్చి యిట్లనిరి. "అతని బుద్ధికుశలత యసాధారణమైనది. ఈసభలో నతఁడు మాటలాడుచున్నప్పుడు వినినవారందఱు వానిపాండిత్య విశేషము నంగీకరించియే యున్నారు. కృష్ణదాస్ పాలునియొద్ద మూఁడు మంచిగుణములుండినవఁట. 1. సమమైనయాలోచనశక్తియు 2. తానునమ్మిన పనిచేయుటలో ధైర్యము 3. కోపము లేకపోవుట యీమూడుఁ నుండుటచే నతఁడు దేశస్థుల యొక్కయు నధికారుల యొక్కయు మెప్పువడసెను" సర్ ‌రిబాడున్ టెంపిదొరగారు నాకాలపు మనుష్యులు కార్యములు యనుగ్రంథము రచియించి యితనిని గూర్చి యిట్లువ్రాసిరి. "గవర్నరు జనరలుగారి సభలోనున్న హిందువులలో కృష్ణదాస్‌పాలను నతఁడె సమర్థుడు. రాజా మాధవరావుగారి తరువాత హిందువులలో నిన్నిసంగతులు తెలిసిన యతఁ డితడొక్కడే శాసన నిర్మాణ సభలో దొరతనమువారి కతఁడు మిక్కిలి సహాయునుగా నుండెను.

కృష్ణదాసపాలునకు కుటుంబ సౌఖ్యము సరిగా నుండలేదు. అతనికి మొట్టమొదట 1856 వ సంవత్సరమున వివాహమయ్యెను. ఆభార్యవలన నతని కిరువురు కొడుకులు గలిగి బాల్యమునందే మృతినొందిరి. పిదప 1872 వ సంవత్సరమునందా భార్య మృతినొందఁగా నతఁడు 1874 వ సంవత్సరమున మరల వివాహము చేసికొనెను. ఈ