పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

88

మహాపురుషుల జీవితములు

ద్వారకనాథున కొకచిత్రమైన యభ్యాసముగలదు. అతఁడు న్యాయవాదిగా నున్న కాలమున కోర్టువారియెదుట వాదముసేయునపుడొక పేనాకలమును రెండుచేతులతోఁ పట్టుకొని యది ముక్కలగువఱకు మెలివేయుచుండును. అతఁడాకలము నెంతవడిగా మెలివేయుచుండునో యతనినోటనుండి మాట యంతవడిగా హెచ్చి వాదము ప్రబలుచుండును. కలము క్రమక్రమముగా నలిగి విఱిగి చేతిలోనుండి పూర్తిగా జారిపడినప్పు డాయన యేమియుం దోచక వాదముసేయ లేక నిలువఁబడునఁట. అందుచే గుమాస్తా యొకడు పేనాకలముల కట్టయొకటి చేతితోఁ బట్టుకొని సిద్ధముగనుండి యజమానుని చేతికలము విఱిగిపడినతక్షణమే మఱియొకకలము నవ్య వథానముగాఁ జేతిలోపెట్టుచుండును.

ద్వారకనాథుఁడు గొప్పయుద్యోగములో నున్నను న్యాయము చెప్పవలసివచ్చినప్పుడు తనపై యధికారులకు సయితము జంకక స్వతంత్రుడై వ్యవహరించుచుండును. అంతటి విద్యయు; విద్యకుం దగిన సత్ప్రవర్తనము దానికిం దగిన మహోన్నతపదవియు గలిగిన యీ మహాపురుషుఁ డంతటి చిన్నతనమందు బోవుటచే నతని యకాలమరణమును గూర్చి దేశస్థులందఱు విచారించిరి.


Mahaapurushhula-jiivitamulu.pdf